Hanuman: అక్కడ కేజిఎఫ్ రికార్డును బద్దలు కొట్టిన హనుమాన్ సినిమా.. తగ్గేదెలే అంటూ!
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా
- By Nakshatra Published Date - 10:35 AM, Wed - 14 February 24
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దాదాపుగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ అప్పటి నుంచి ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని అందరి చేత శబాష్ అనిపించుకుంది. కాగా ఈ సినిమాను కన్నడ తమిళం హిందీ మలయాళ భాషల్లో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.
అన్ని భాషల్లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల సునామీని సృష్టించింది హనుమాన్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన హనుమాన్ అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికే చాలా రికార్డ్ క్రియేట్ చేసిన హనుమాన్ తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక స్టార్ హీరో సినిమాను బీట్ చేసింది హనుమాన్. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ యశ్. హిందీ మార్కెట్లో గతంలో కేజీఎఫ్: చాప్టర్ 1 రికార్డును హనుమాన్ బద్దలు కొట్టింది. రాకింగ్ స్టార్ యష్ నటించింది కేజీఎఫ్ 1 చిత్రం హిందీలోకి డబ్ చేశారు. హిందీ వెర్షన్ నుంచి ఆ సినిమా 44 కోట్ల వరకు వసూల్ చేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని హనుమాన్ సినిమా అధిగమించింది.
హిందీలో డబ్ అయిన హనుమాన్ సినిమా 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పటికీ చాలా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది హనుమాన్. దాంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ సినిమా కేజీఎఫ్ రికార్డులను బద్దలు కొట్టడం అన్నది నిజంగా చాలా గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Related News
Sai Dhansika : ముద్దు సీన్లు, బెడ్ రూమ్ రొమాన్స్.. అవి చేయకుండా రాణించాలంటే..?
Sai Dhansika కేవలం తమ యాక్టింగ్ టాలెంట్ తోనే హీరోయిన్స్ గా రాణించాలంటే చాలా కష్టమనే చెప్పాలి. ఒకసారి కాకపోయినా ఎక్కడో ఒకచోట గ్లామర్ సైడ్ చూపించాల్సి