Pawan – Prakash Raj : పవన్ కళ్యాణ్ ను వదలని ప్రకాష్ రాజ్..ఈసారి ఎలా ట్వీట్ చేసాడో తెలుసా..?
Pawan - Praksh Raj : ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మళ్లీ మొదలైంది. ‘భరత్ అనే నేను’ ఈవెంట్‌లో మహేశ్ చేసిన శాంతియుత వ్యాఖ్యలతో పవన్ తాజా వ్యాఖ్యలను పోల్చుతూ అభిమానులు తేడా చర్చిస్తున్నారు
- By Sudheer Published Date - 11:19 AM, Wed - 30 July 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘హరిహర వీరమల్లు’ సక్సెస్ మీట్(HHVM Success Meet)లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారాన్ని ఎదుర్కొనాలని అభిమానులకు పిలుపునిచ్చిన పవన్ (Pawan Kalyan Comments) వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కూడా ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యవహారశైలిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ కు మనసాక్షి లేదని, సినిమాలను ఓ రాజకీయ వేదికలా వాడుకుంటున్నారని ఆరోపించారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనవసరమైన ఎలివేషన్స్ ఇచ్చారని, టిక్కెట్ రేట్లను అన్యాయంగా పెంచారని, కథకే ప్రాముఖ్యత లేకుండా సినిమాను లాభాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా పవన్ చేతగానితనంతో దర్శకుడు మారిపోయిన విషయాన్ని ప్రస్తావించారు.
Betting apps case : ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్‌రాజ్
స్టేజ్ మీద రెచ్చగొట్టేలా మాట్లాడడం అభిమానులను తప్పుదోవ పట్టించడమేనని ప్రకాశ్ రాజ్ అన్నారు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌ల మాటలను ఉదహరిస్తూ.. “విమర్శలు వచ్చినా సంయమనంతో వ్యవహరించాలి” అన్న మాటల్ని గుర్తు చేశారు. కానీ పవన్ మాత్రం అభిమానులను ప్రత్యర్థులపై దాడులకు ప్రోత్సహించడం అర్థరహితమని అన్నారు. ఒకరిపై ప్రేమను చూపించాలంటే చొక్కాలు చించుకోవడం కాదు, వారి పదాలు అనుసరించడమే కావాలని వ్యాఖ్యానించారు.
ఇక ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మళ్లీ మొదలైంది. ‘భరత్ అనే నేను’ ఈవెంట్‌లో మహేశ్ చేసిన శాంతియుత వ్యాఖ్యలతో పవన్ తాజా వ్యాఖ్యలను పోల్చుతూ అభిమానులు తేడా చర్చిస్తున్నారు. ఈ ఆరోపణలు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.