NBK109 : బాలయ్యకి జోడిగా మరోసారి ఆ నటి.. పవర్‌ఫుల్ పాత్రలో ఊర్వశి రౌటెలా..!
NBK109లో బాలయ్యకి జోడిగా మరోసారి ఆ నటి. ఇక పవర్‌ఫుల్ పాత్రలో ఊర్వశి రౌటెలా..
- By News Desk Published Date - 03:48 PM, Sun - 21 July 24

Balakrishna : ప్రస్తుతం వరుస విజయాల్లో ఉన్న బాలయ్య.. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీకి నెక్స్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. #NBK109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో బాలయ్యతో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారట. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజని చూపించిన బాబీ.. ఈ మూవీలో బాలయ్యతో పాటు దుల్కర్ సల్మాన్ చూపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది.
అలాగే ఒక పవర్‌ఫుల్ ఫిమేల్ లీడ్ రోల్ కూడా ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా కనిపించబోతున్నారట. ఈ పాత్ర పోలీస్ రోల్ అని సమాచారం. ఈ సినిమా ఓ రేంజ్ వైలెన్స్ తో ఉండబోతుందని దర్శకుడు బాబీ ఆల్రెడీ తెలియజేసారు. ఇలాంటి కథల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలకు చాలా ప్రాధాన్యతే ఉంటుంది. మరి ఊర్వశిని బాబీ ఎలా చూపించబోతున్నారో చూడాలి. కాగా ఈ మూవీలో బాలయ్యకి జోడిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గా ఉంది. అయితే ఆ పాత్ర కోసం ఆల్రెడీ బాలయ్యతో కలిసి నటించిన హీరోయినే ఎంపిక చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది.
అఖండ సినిమాలో బాలయ్య సరసన నటించి మెప్పించిన భామ ‘ప్రగ్యా జైస్వాల్’. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యకి జోడిగా కనిపించి ఆకట్టుకునేందుకు సిద్దమవుతున్నారట. కాగా ఈ సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తీ చేసుకుంటూ వస్తున్న మూవీ టీం.. ఇప్పటివరకు రిలీజ్ డేట్ పై ఎటువంటి హింట్ ఇవ్వలేదు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వీరా’, ‘వీర మాస్’ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. SS థమన్ సంగీతం అందిస్తున్నారు.