Pradeep Ranganathan: సూపర్‌స్టార్లకి కథ చెప్పిన లవ్ టుడే దర్శకుడు!
సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘లవ్ టుడే’ (Love Today) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన
- Author : Maheswara Rao Nadella
Date : 13-02-2023 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘లవ్ టుడే’ (Love Today) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ కోలీవుడ్ (Kollywood) మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీతో దర్శక నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కి మంచి పాపులారిటీ వచ్చింది. నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుతూ.. ఇతర యువ దర్శకులతో పోటీపడుతూ తన ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఆ కోవలోనే ఆయన వరుసగా రెండు హిట్ చిత్రాలు అందించారు. ఈ రెండూ కూడా థియేటర్‌లలో వంద రోజులు పూర్తి చేసుకోవడం గమనార్హం.
జయం రవి హీరోగా 2019లో ‘కోమాలి’ (Comali) అనే సినిమాకి ప్రదీప్ (Pradeep Ranganathan) మొదటిసారి దర్శకత్వం వహించాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుని వంద రోజులు పూర్తి చేసుకుంది. అలాగే, గత ఏడాది తాను దర్శకత్వం వహించి హీరోగా నటించిన ‘లవ్‌టుడే’ చిత్రం సూపర్‌డూపర్ హిట్ అయింది. ఒక్క తమిళంలోనేకాకుండా, తెలుగులోకి అనువాదం చేయగా అక్కడ కూడా నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఓటీటీల కాలంలో సినిమా థియేటర్‌లో ఎక్కువ రోజులు ప్రదర్శించబడటం అంటే సాధారణం కాదు. కానీ, ‘లవ్‌టుడే’ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఆయన చేపట్టే తదుపరి ప్రాజెక్టుపై సస్పెన్స్ నెలకొంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు పలువురు అగ్రహీరోలకు ఆయన కథ వినిపించారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు తదుపరి చిత్రంలోనూ ఆయనే హీరోగా నటించనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇంతవరకూ ప్రదీప్ స్పందిచలేదు.
Also Read: Diabetes: భారత్‌లో 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!