Prabhas treats: ఆహా ఏమి రుచి.. ప్రభాస్ వంటకాలకు దీపికా ఫిదా!
అతిథి దేవోభవ. 'ఆతిథ్యం' అంటే భోజనం పెట్టడంతో పాటు ఆత్మీయంగా ఆదరించడం కూడా. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వంటకాలు అంటే ఎంతో ఇష్టం. ఆయన టేస్ట్ చేయడమే కాకుండా.. గెస్ట్ లకు అదిరిపొయే ట్రీట్ ఇస్తుంటారు.
- By Balu J Published Date - 05:48 PM, Mon - 13 December 21
అతిథి దేవోభవ. ‘ఆతిథ్యం’ అంటే భోజనం పెట్టడంతో పాటు ఆత్మీయంగా ఆదరించడం కూడా. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు వంటకాలు అంటే ఎంతో ఇష్టం. ఆయన టేస్ట్ చేయడమే కాకుండా.. గెస్ట్ లకు అదిరిపొయే ట్రీట్ ఇస్తుంటారు. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు చాలామంది ప్రభాస్ ఆతిథ్యం స్వీకరించినవాళ్లే. ఇక బాలీవుడ్ నటులు ఎవరైనా హైదరాబాద్ కు వస్తే.. ప్రభాస్ వంటలను టెస్ట్ చేయాల్సిందే. గతంలో సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్, ‘ఆదిపురుష్’ హీరోయిన్ కృతిసనన్ సైతం ప్రభాస్ వంటలను రుచిచూశారు. ఇప్పుడు దీపికా కూడా ప్రభాస్ తెప్పించిన వంటకాలకు ఫిదా అయ్యింది.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ పక్కన నటిస్తోంది. ఈ ప్రాజెక్టు పేరు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ ప్రతిష్టాత్మక మూవీలో ‘బిగ్ బి’ అమితాబ్ కూడా నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగబోయే షెడ్యూల్ కోసం దీపికా ఇప్పటికే సిటీకి చేరుకుంది. అయితే కొత్ షెడ్యూల్ షూటింగ్ సమయంలో ప్రభాస్ దీపికా పదుకొణెకు ప్రత్యేక వంటకాలను ప్రిపర్ చేశాడు. బిర్యానీ, కబాబ్ తో పాటు ఏడురకాల వంటకాలను రుచి చూపించాడు. ఈ వంటకాలు మీకు తెలుసా అంటూ దీపిక “If You Know ” సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ ఇన్నాళ్లూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. “దీపిక ఈ పాత్రలో నటించినందుకు నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. ఇంతకు ముందు ఏ మెయిన్ స్ట్రీమ్ లీడ్ చేయనిది, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీపిక, ప్రభాస్‌ల జోడి ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ ఒకటి. వారి మధ్య జరిగే కథ రాబోయే సంవత్సరాల్లో ప్రేక్షకులు తమ హృదయాల్లో ఉంచుకునేలా ఉంటుందని నేను నమ్ముతున్నాను.” అని అన్నారు.
Tags
Related News
Salaar 2 : సలార్ 2 షూటింగ్ గురించి.. యాక్టర్ షఫీ ఇంటరెస్టింగ్ పోస్ట్..
సలార్ 2 షూటింగ్ గురించి యాక్టర్ షఫీ తన ఇన్స్టాగ్రామ్ లో ఇంటరెస్టింగ్ పోస్ట్ వేశారు.