Prabhas Salaar : సలార్ కథ అదేనా.. ప్రాణ స్నేహితుల మధ్య భీకర యుద్ధం..!
Prabhas Salaar ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ లాక్ చేశారు. సలార్ పార్ట్ 1 ఆరోజున
- Author : Ramesh
Date : 17-10-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas Salaar ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ లాక్ చేశారు. సలార్ పార్ట్ 1 ఆరోజున రాబోతుంది. ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే సలార్ కథ ఇదే అంటూ ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. సలార్, దేవా తండ్రి కొడుకుల పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నారట.
సినిమాలో రాజ మన్నార్ గా జగపతి బాబు (Jagapati Babu) నటిస్తున్నారు. అతని వారసుడు వరదరాజ మన్నార్ గా పృధ్వి రాజ్ సుకుమార్ చేస్తున్నారు. దేవా వరద రాజ ప్రాణ స్నేహితులే కానీ సలార్ సామ్రాజ్యాన్ని తూట్లు పడేందుకు కారణమైన గ్యాంగ్ గురించి తెలుసుకోగా అది ఎవరో కాదు తన ఫ్రెండేనని తెలుసుకుని నిర్ఘాంతపోతాడట. ఆ తర్వాత ప్రాణ స్నేహితుల మధ్య జరిగే యుద్ధమే సలార్ కథ అని తెలుస్తుంది.
అయితే సలార్ పార్ట్ 1 లో దేవ పాత్ర ఉంటుందా సలార్ (Salaar) పాత్ర ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ (Prabhas) తండ్రి కొడుకులుగా నటించాడు. ఆ సినిమాలో లాగా దేవ పాత్రని చంపకుండా ఇద్దరు ప్రభాస్ లు కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్ (Prashanth Neel). ప్రభాస్ సలార్ 1 డిసెంబర్ లో రిలీజ్ అవుతుండగా సలార్ పార్ట్ 2 రెండేళ్ల తర్వాతే రిలీజ్ ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.
సలార్ 1 తో పాటుగా నెక్స్ట్ ఇయర్ మే లో ప్రభాస్ కల్కి (Kalki) సినిమాతో వస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కుతుంది.
Also Read : Prabhas Lokesh Kanakaraj : ప్రభాస్ తో లోకేష్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!