Prabhas Lokesh Kanakaraj : ప్రభాస్ తో లోకేష్.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
Prabhas Lokesh Kanakaraj కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలు తక్కువే అయినా అతని సినిమాలు ఆడియన్స్ కి ఇస్తున్న కిక్
- By Ramesh Published Date - 05:49 PM, Tue - 17 October 23

Prabhas Lokesh Kanakaraj కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాలు తక్కువే అయినా అతని సినిమాలు ఆడియన్స్ కి ఇస్తున్న కిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా లోకేస్ కనకరాజ్ యూనివర్స్ అంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న అతను ప్రస్తుతం దళపతి విజయ్ (Vijay) తో లియో సినిమా చేశారు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) తెలుగు మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ హీరోలతో కూడా తను సినిమాల ప్లానింగ్ తో ఉన్నానని అన్నారు. ప్రభాస్ (Prabhas)తో సినిమా తీస్తే అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని. ప్రభాస్ కోసం కథ సిద్ధం చేస్తున్నానని అన్నారు లోకేష్ కనకరాజ్. ఆల్రెడీ పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ తో లోకేష్ సినిమా చేస్తే మాత్రం రికార్డులన్ని పక్కకు తప్పుకోవాల్సిందే.
లోకేష్ తీసిన ఖైదీ, విక్రం (Vikram) తెలుగులో సూపర్ హిట్లుగా నిలిచాయి. లియో సినిమా కూడా వాటికి ఈక్వెల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రచార చిత్రాలైతే లోకేష్ సినిమా రేంజ్ లేదని టాక్ మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి. విజయ్ లియో తెలుగు రిలీజ్ భారీగా ఉన్నా సరే తెలుగు ప్రమోషన్స్ ని గాలికి వదిలేశారు. తెలుగులో విజయ్ లియోని 20 కోట్ల దాకా పెట్టి కొన్నారని తెలుస్తుంది.
మరి అన్ని కోట్ల బిజినెస్ జరిగినా ఇక్కడ ప్రమోషన్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. విజయ్ తెలుగు మార్కెట్ ని లైట్ తీసుకోవడం వెనక రీజన్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Allu Arjun : పుష్ప రాజ్ చేతిలో నేషనల్ అవార్డ్.. ఇది కదా అసలైన రికార్డ్..!