Prabhas – Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ కొత్త సంచలనం.. గత దశాబ్దం కాలంలో..
ప్రముఖ రేటింగ్ సంస్థ IMDb కొత్త సర్వేలో ప్రభాస్, రామ్ చరణ్ కొత్త సంచలనం. గత దశాబ్దం కాలంలో..
- By News Desk Published Date - 07:40 PM, Wed - 29 May 24

Prabhas – Ram Charan : రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తమ సినిమాలతో తమ ఇమేజ్ ని పెంచుకుంటూ ఎంతో ఫేమ్ ని సంపాదించుకుంటున్నారు. దీంతో వీరిద్దరూ కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ IMDb కొత్త సర్వేలో ప్రభాస్ అండ్ రామ్ చరణ్ సంచలనం సృష్టించారు. అదేంటంటే.. గత దశాబ్దం (2014-2024) కాలంలో ఎక్కువ వ్యూస్ అందుకున్న ఇండియన్ స్టార్ ఎవరని ఒక సర్వే నిర్వహించారు.
ఈ సర్వేలో నార్త్ స్టార్స్ ముందు వరుసలో నిలిచారు. ఇక సౌత్ నుంచి చూసుకుంటే.. ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. IMDb నిర్వహించిన ఈ సర్వేలో ప్రభాస్ 29వ స్థానంలో నిలిచారు. ప్రభాస్ తరువాత టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఈ సర్వేలో స్థానం దక్కించుకున్నారు. 31వ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. ఇక అల్లు అర్జున్ 47వ స్థానంలో నిలవగా.. ఎన్టీఆర్ 67వ స్థానంలో, మహేష్ బాబు 72వ స్థానంలో నిలిచారు. టాప్ 100 లిస్టులో స్థానం దక్కించుకున్న తెలుగు హీరోలు వీరు మాత్రమే.
2015 నుంచే మన తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుతూ వచ్చింది. బాహుబలితో మొదలైన టాలీవుడ్ ఎదుగుదల ఆర్ఆర్ఆర్, పుష్పతో ఇంటర్నేషనల్ లెవెల్ వరకు చేరింది. ఇక ఈ సినిమాలతో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సూపర్ ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. మహేష్ బాబు నుంచి ఇప్పటివరకు ఎటువంటి పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాలేదు. అయినాసరి మహేష్ ఈ సర్వే లిస్టులో ఉండడం విశేషం. మరి నెక్స్ట్ పదేళ్లలో తెలుగు హీరోలు ఇంకెంత స్థాయికి ఎదుగుతారో చూడాలి.