Prabhas Raja Saab : రాజ సింహాసనం మీద రాజా సాబ్.. ప్రభాస్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసిందోచ్..!
Prabhas Raja Saab మారుతి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది
- By Ramesh Published Date - 02:39 PM, Wed - 23 October 24

రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ వచ్చింది. కొద్ది నిమిషాల క్రితమే రాజా సాబ్ మోషన్ పోస్టర్ ( Rajasaab Motion Poster) రిలీజ్ చేశారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. హర్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఆమధ్య స్టైలిష్ లుక్ తో ప్రభాస్ గ్లింప్స్ వదలగా నేడు ప్రభాస్ (Prabhas,) బర్త్ డే సందర్భంగా టీజర్ వదులుతారు అనుకోగా జస్ట్ మోషన్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఆ పోస్టర్ విషయానికి వస్తే అడవిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తాడు.. కట్ చేస్తే సిగార్ తో రాజ సింహాసనం మీద ప్రభాస్ వెరైటీ గెటప్ లో సర్ ప్రైజ్ చేశాడు.
హర్రర్ కాన్సెప్ట్ తో రాజా సాబ్..
హర్రర్ కాన్సెప్ట్ తో నవ్వించడానికి ఈ రాజా సాబ్ రెడీ అవుతుంది. మారుతి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి డైరెక్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మోషన్ పోస్టర్ అయితే భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.
రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ (Thaman) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్.