Prabhas Maruthi Movie Title : రాజా డీలక్స్ కాదు.. ప్రభాస్ మారుతి మూవీ టైటిల్ ఇదే..!
Prabhas Maruthi Movie Title రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాక
- By Ramesh Published Date - 06:10 PM, Fri - 12 January 24
Prabhas Maruthi Movie Title రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాక సినిమా గురించి రివీల్ చేశారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న ఈ సినిమా విషయంలో అంతా సీక్రెట్ గా ఉంచుతున్నారు. ఓ పక్క పాన్ ఇండియా డైరెక్టర్స్, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతితో సినిమా చేయడం ఏంటని రెబల్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ మారుతి కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే సినిమాకు ఓకే చెప్పాడు.
We’re now on WhatsApp : Click to Join
అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్ గానే కానిస్తున్నారట. ప్రభాస్ సినిమా కాబట్టి ఎలాగు బజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందుకు తగినట్టుగానే బిజినెస్ చేసేలా ఉంది. ఈ సినిమాకు టైటిల్ గా చాలా పేర్లు ప్రచారం లో ఉన్నాయి. మొదటి నుంచి రాజా డీలక్స్ అనే టైటిల్ మారుతి ప్రభాస్ సినిమాకు ఫిక్స్ అని ప్రచారం లో ఉంది. ఆ తర్వాత అంబాసిడర్, రాయల్ టైటిల్స్ కూడా పరిశీలనలో ఉంచారు. పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి టైటిల్ కూడా అదే రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు.
ఇక ఫైనల్ గా ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. రాజా డీలక్స్ అనే ఓల్డ్ థియేటర్ చుట్టూ సినిమా కథ నడుస్తుందట. సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. మారుతి మార్క్ కామెడీ టచ్ ఇస్తూనే నేషనల్ లెవెల్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా చూసుకున్నారట. కచ్చితంగా ఈ సినిమా తర్వాత మారుతి కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడని చెప్పడంలో సందేహం లేదని అంటున్నారు.
Also Read : Meenakshi Chowdhary : ఇలాంటి పాత్రలు అవసరమా మీనాక్షి..!
రీసెంట్ గా సలార్ 1 తో ఫ్యాన్స్ ముందుకొచ్చిన ప్రభాస్ ఈ సమ్మర్ లో కల్కిగా రాబోతున్నాడు. సినిమా రిలీజ్ డేట్ కూడా లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రాజా సాబ్ రిలీజ్ ఉంటుంది. సాధ్యమైనంతవరకు రాజా సాబ్ ని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ మారుతి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ రాజా సాబ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Related News
Baahubali : కట్టప్ప విలన్గా బాహుబలి యానిమేషన్ సిరీస్.. ట్రైలర్ చూసారా..?
బాహుబలి యానిమేషన్ సిరీస్ ట్రైలర్ చూసారా..? కట్టప్ప విలన్గా మారితే బాహుబలి, భల్లాలదేవ కలిసి అతడి పై యుద్ధం చేస్తున్నారు.