Prabhas Kalki 2898AD : కల్కి తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్క ఇదే.. వరల్డ్ వైడ్ గా దుమ్ము దులిపేస్తున్న ప్రభాస్..!
Prabhas Kalki 2898AD ప్రభాస్ కల్కి సినిమ మే లో రిలీజ్ ఉంటుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మాక్సిమం సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ ప్లాన్
- By Ramesh Published Date - 12:30 PM, Wed - 14 February 24
Prabhas Kalki 2898AD ప్రభాస్ కల్కి సినిమ మే లో రిలీజ్ ఉంటుందా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మాక్సిమం సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో కల్కి 2898 ఏడి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే బిజినెస్ లో అదరగొట్టేస్తుంది. కల్కి తెలుగు రెండు రాష్ట్రాల్లో బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది.
ప్రభాస్ కి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తెలుగులో తన రేంజ్ డబుల్ చేసుకున్నాడు. అందుకే ప్రభాస్ ప్రతి సినిమా ఇక్కడ సూపర్ బిజినెస్ చేస్తుంది. ఈ క్రమంలో కల్కి సినిమాకు కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 200 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ కూడా కల్కికి బాగా జరిగిందని టాక్.
కల్కి సినిమా ఓవర్సీస్ లో 100 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ఇక రెస్టాఫ్ వరల్డ్ మొత్తం 300 కోట్ల దాకా బిజినెస్ చేసిందని టాక్. మొత్తంగా ప్రభాస్ కల్కి సినిమా 500 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కల్కి సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని కూడా సినిమాలో భాగం అవుతున్నారు. కల్కి సినిమా అసలైతే మే 9న రిలీజ్ లాక్ చేయగా సినిమా అనుకున్న డేట్ కి వస్తుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.
Tags
Related News
ప్రభాస్ ‘Kalki 2898 AD’ లుక్ వచ్చేసింది..అభిమానుల్లో పూనకాలే ..!!
IPL సీజన్ లో భాగంగా మే 3న ముంబై, KKR మ్యాచ్ ఉంటుందని ప్రభాస్ తో చెప్పించి ఆకట్టుకున్నారు