The Raja Saab : పవన్ రికార్డు ను బ్రేక్ చేసిన ప్రభాస్..
The Raja Saab : ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజైన 'రాజాసాబ్' మోషన్ పోస్టర్ రికార్డు సృష్టించింది. గత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ యూట్యూబ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా వార్తల్లో నిలిచింది
- By Sudheer Published Date - 12:22 PM, Thu - 24 October 24

ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ (The RajaSaab) అప్పుడే రికార్డ్స్ మొదలుపెట్టడమే కాదు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్ రికార్డు సృష్టించింది. గత రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ యూట్యూబ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన మోషన్ పోస్టర్ గా వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ (5.83M) మూవీ మోషన్ పోస్టర్ పేరిట ఈ రికార్డు ఉండేది. 19.5 గంటల్లోనే ‘రాజాసాబ్’ పోస్టర్ వీడియోకు 5.85M వ్యూస్ వచ్చాయి.
ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తుండగా.. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 50శాతం పూర్తి చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తో పాటు ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్’ కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్.
Read Also : US ELECTIONS: ట్రంప్ గెలిస్తే ఫస్ట్ సంతకం దేనిపైనో తెలుసా..?