Pawan Kalyan: వావ్.. పవర్ స్టార్ న్యూ లుక్ చూశారా..!
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ చిత్ర మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి మరో అప్డేట్ ఇచ్చాడు. నవరాత్రుల్లో
- By hashtagu Published Date - 10:03 PM, Fri - 30 September 22
Pawan Kalyan: క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ చిత్ర మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి మరో అప్డేట్ ఇచ్చాడు. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ పవన్ కల్యాణ్‌తో ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కీరవాణి పోస్ట్ చేసిన మూవీలో వారి వెనుక ఉన్న బోర్డుపై హరిహర వీరమల్లు షెడ్యూల్ వర్క్ షాప్ అని ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. అయితే కీరవాణి ఈ ఫొటో పోస్ట్ చేయడంతోనే క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. దానికి కారణం ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కొత్త లుక్. ఈ లుక్‌లో పవన్ కల్యాణ్ యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నాడు.
పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ న్యూ లుక్ సూపర్ ఉందని.. అదిరిందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మరోవైపు సినిమాలు కూడా ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న హరిహర వీరమల్లు మూవీ 2023 మార్చి 30న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం, నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవర్ స్టార్ తొలిసారి పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. మరోవైపు సముద్రఖని దర్శకత్వంలో మూవీ సాయి ధరమ్‌తేజ్ తో ఓ మూవీని పవన్ చేస్తోన్న విషయం తెలిసిందే. కానీ ఈ మూవీకి సంబంధించిన విషయాలు మాత్రం బయటకు రాకుండా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకుంటోంది.
Related News
OG – Game Changer : ఓజి, గేమ్ ఛేంజర్ రిలీజ్.. అబ్బాయి కోసం బాబాయ్ వెనక్కి తగ్గుతున్నాడా..?
ఓజి, గేమ్ ఛేంజర్ రిలీజ్స్ లో మార్పు ఉండొచ్చట. అబ్బాయి కోసం బాబాయ్ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.