Posani Krishna Murali : రోజా భర్త సెల్వమణిపై పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు..
పోసాని కృష్ణ మురళిని పలువురు మీడియా ప్రతినిధులు RK సెల్వమణి ఇలాంటి రూల్స్ తెచ్చారని, దానిపైన మీ అభిప్రాయం ఏంటని అడిగారు.
- Author : News Desk
Date : 30-07-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఇటీవల తమిళ్(Tamil) వాళ్ళు తమిళ యాక్టర్స్, టెక్నీషియన్స్ తోనే వర్క్ చేయాలని, తమిళనాడులోనే షూటింగ్స్ చేయాలని తమిళ్ డైరెక్టర్, రోజా భర్త, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(FEFSI) అధ్యక్షుడు RK సెల్వమణి(RK Selvamani) వ్యాఖ్యలు చేశారు. FEFSI లో కొత్త రూల్స్ కూడా చేశారని, వాటిని అధిగమించిన వారిపై చర్యలు కూడా తీసుకుంటామని అన్నారు. ఈ రూల్స్ పై అన్ని పరిశ్రమలతో పాటు తమిళ్ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అది వర్కౌట్ అవ్వదు, అందరు కలిసి పనిచేసి భారీ సినిమాలు చేయాలని, ఇండియన్ సినిమా అభివృద్ధి జరుగుతుంటే ఇలాంటి సమయంలో ఈ నిర్ణయాలు తప్పని అందరూ భావిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఈ నిర్ణయం తప్పని వ్యాఖ్యలు చేశారు. తాజాగా పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali )దీనిపై స్పందించారు.
నేడు తెలుగు ఫిలిం ఛాంబర్(Telugu film Chamber) ఎలక్షన్స్ జరుగుతుండటంతో అక్కడికి వచ్చిన పోసాని కృష్ణ మురళిని పలువురు మీడియా ప్రతినిధులు RK సెల్వమణి ఇలాంటి రూల్స్ తెచ్చారని, దానిపైన మీ అభిప్రాయం ఏంటని అడిగారు. దీనికి పోసాని సమాధానమిస్తూ.. తమిళ్ వాళ్ళు చాలా మంచోళ్ళు. తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు మనకు సపోర్ట్ చేశారు. సెల్వమణి ఎవరు? అసలు అతను ఇప్పుడు సినిమాలు తీస్తున్నాడా? ఎన్ని తీశాడు? అసలు యాక్టివ్ గా లేడు, అతను అంటే తమిళ పరిశ్రమ మొత్తం అన్నట్టు కాదు. అసలు అది జరగని పని. స్టార్ హీరోలు కమల్, రజిని, విజయ్.. ఇలా చాలా మంది సినిమాలు జరగవు. అక్కడ తెలుగోళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తమిళ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో సెల్వమణి అన్నంత మాత్రాన అది జరగదు. వాళ్ళు ఇక్కడి సినిమాలకు పని చేస్తారు, మన వాళ్ళు అక్కడి సినిమాలకి పని చేస్తారు అని వ్యాఖ్యలు చేసారు.
దీంతో పోసాని RK సెల్వమణిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రోజా(Roja), పోసాని ఇద్దరూ వైసీపీ(YCP)నే. అలాంటిది రోజా భర్త సెల్వమణిని పోసాని ఎవరో తెలీదు అనడం, అతను చెప్తే జరిగిపోద్దా అని అతనిపై ఫైర్ అవ్వడంతో పోసాని వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో కూడా చర్చగా మారాయి.
Also Read : Bro Movie Collections : అదరగొడుతున్న బ్రో కలెక్షన్స్.. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్..