Bro Movie Collections : అదరగొడుతున్న బ్రో కలెక్షన్స్.. పవన్ కెరీర్ లోనే హైయెస్ట్..
బ్రో సినిమా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే కలెక్షన్స్ మంచిగా మొదలయి సినిమా రిలీజ్ రోజు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ కి జనాలు పోటెత్తారు.
- By News Desk Published Date - 07:30 PM, Sun - 30 July 23

పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా బ్రో(Bro Movie). పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమా భారీ అంచనాలతో జులై 28న రిలీజయి థియేటర్స్ లో అదరగొడుతుంది. ఒక మంచి ఎమోషనల్ స్టోరీకి కమర్షియల్ ఎలిమింట్స్, ఫ్యాన్స్ కి కావాల్సిన స్పెషల్ ఎలిమెంట్స్ జత చేసి బ్రో సినిమాని రిలీజ్ చేశారు. దీంతో బ్రో సినిమా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.
అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే కలెక్షన్స్ మంచిగా మొదలయి సినిమా రిలీజ్ రోజు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ కి జనాలు పోటెత్తారు. దీంతో బ్రో సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. బ్రో సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ గా నిలిచింది. ఇక రెండో రోజు 27 కోట్లు కలెక్ట్ చేసి ఏకంగా రెండు రోజుల్లో బ్రో సినిమా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
పవన్ కెరీర్ లో రెండు రోజుల్లో 75 కోట్ల కలెక్షన్స్ ఇదే మొదటిసారి. ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ కూడా కలెక్షన్స్ బాగా వస్తాయని, మూడు రోజుల్లో 100 కోట్ల కలెక్షన్స్ గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు. కలెక్షన్స్ ఈ రేంజ్ లో వచ్చి బ్రో సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మామా అల్లుళ్ళు ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నారు.
Also Read : Hollywood Movies : హాలీవుడ్ సినిమాలు ఇండియాలో 100 కోట్లు.. ఓపెన్ హైమర్, మిషన్ ఇంపాజిబుల్ 7 హవా..