Poonam Kaur : త్రివిక్రమ్ ఫై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు – పూనమ్ ట్వీట్
Poonam Kaur _Trivikram : ‘అప్పుడే అతడిపై "మా" చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు
- By Sudheer Published Date - 05:22 PM, Tue - 17 September 24

PoonamKaur Sensational Tweet On Trivikram : ఛాన్స్ దొరికితే చాలు డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) ని టార్గెట్ చేస్తూ ఉంటుంది పూనమ్. సందర్భం ఏదైనా సడెన్ గా ఒక ట్వీట్ వేసి సైలెంట్ గా నిప్పు రాజేస్తుంది అమ్మడు. అంతకుముందు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసే పూనం కౌర్ ఈమధ్య డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరు పెట్టి మరి ట్వీట్స్ చేస్తుంది. ఆ మధ్య వేస్ట్ ఫెలో అంటూ డైరెక్ట్ గా త్రివిక్రం పేరుని మెన్షన్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో గురువు అంటే అది దాసరి నారాయణ రావు గారే అని వేరే ఎవ్వరు కాదని అంటూ కామెంట్ చేసింది.
ఇక ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం తో మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood ) లోనే కాదు పక్క ఇండస్ట్రీ లలో కూడా జానీ మాస్టర్ (Jani Master) ఫై లైంగిక కేసు నమోదు కావడం పై మాట్లాడుకుంటున్నారు. చిత్రసీమలో ఇలాంటి జానీ మాస్టర్ లు ఎంతో మంది ఉన్నారు కానీ ధైర్యం చేసి బాధితులు ముందుకు రావడం లేదని..ఆలా వస్తే ఎంతో మంది మాస్టర్ల బండారం బయటపడుతుందని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు జానీ (Jani) కోసం వెతుకుతున్నారు. నిన్నటి నుండి జానీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం తో ఎక్కడికో పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ లైంగిక వేధింపుల కేసు పై చిత్రసీమలో ఒక్కక్కరు ఓపెన్ అవుతున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) , గాయని చిన్మయి (Chinmayi Sripada) రియాక్ట్ అయ్యారు.
జానీని ‘మాస్టర్’ అని పిలవద్దంటూ పూనమ్ సూచించింది. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు. ‘మాస్టర్’ అనే పదానికి కాస్త గౌరవం ఇవ్వండి’ అని ట్వీట్ చేసింది వార్తల్లో నిలిచింది. ఈ ట్వీట్ గురించి అంత మాట్లాడుకుంటుండగానే మరో ట్వీట్ చేసింది. తాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ‘అప్పుడే అతడిపై “మా” చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు అని ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ, నాలా చాలామందికి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో నా ఫిర్యాదును వారు తిరస్కరించారు. ఆ తరువాత కూడా నేను పెద్దలకు ఫిర్యాదు చేశాను. వాళ్లు కూడా నన్ను సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఇప్పుడైనా దర్శకుడు త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో..త్రివిక్రమ్ ఫై చర్యలు తీసుకుంటుందో..? అసలు త్రివిక్రమ్ కు పూనమ్ కు మధ్య ఏంజరిగిందో..? అని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు.
Had maa association taken complaint on trivikram Srinivas ,
I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024
Read Also : Ajit Pawar : నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్ కీలక ప్రకటన