Poonam Kaur : హీరో వేధిస్తున్నాడంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
Poonam Kaur : 'ఒక సూపర్ స్టార్ డమ్ కలిగిన హీరో నన్ను వేధిస్తున్నాడు.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు. మేము సినిమాలో ఇంటిమెటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగానే భారీ మొత్తంలో ఉమ్మి వేశాడు
- By Sudheer Published Date - 04:01 PM, Sun - 17 November 24

పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్ చేసి ఇండస్ట్రీ లో కాకరేపింది. పూనమ్ (Poonam Kaur) సినిమాలకన్నా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన పాపులార్టీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. నిత్యం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) ల ఫై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. నిజంగా వారి వల్ల ఈమె ఎంత నష్టపోయిందో తెలియదు కానీ..బయట మాత్రం పూనమ్ కౌర్ కెరియర్ ను వీరిద్దరే నాశనం చేసారని మాత్రం ఓ వర్గం ప్రచారం చేస్తుంటుంది. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా పూనమ్ సైతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయడం , విమర్శలు , ఆరోపణలు చేయడం చేస్తుంటుంది. ఈ మధ్య అయితే డైరెక్ట్ గా త్రివిక్రమ్ పేరు పెట్టె విమర్శలు చేస్తుంది.
ఇదిలా ఉంటె తాజాగా మరో ట్వీట్ చేసింది. కాకపోతే ఈసారి మరో హీరోయిన్ ను ఓ స్టార్ డం హీరో వేధిస్తున్నాడంటూ పేర్కొంది. నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో నాతో పాటు ఒక అమ్మాయి నటించింది. తర్వాత ఆమె హీరోయిన్ గా కొన్ని రోల్స్ చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలు చేయడం ఆపేసింది. అలాగే ఎవరికీ కనిపించకుండా పోయింది. తాజాగా నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్‌లో కనిపించింది. ఆమె నాతో పెళ్ళికి షాపింగ్ కి వచ్చినట్లు, తాను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికీ చెప్పొదంటూ రిక్వెస్ట్ చేసింది. ఏమైందని నేను అడగగా ఆమె సమాధానమిస్తూ.. ‘ఒక సూపర్ స్టార్ డమ్ కలిగిన హీరో నన్ను వేధిస్తున్నాడు.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు. మేము సినిమాలో ఇంటిమెటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగానే భారీ మొత్తంలో ఉమ్మి వేశాడు. డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు’ అంటూ చెప్పింది. అలాగే తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళింది. కానీ.. ఆ హీరో వేదింపులు ఇంకా తగ్గలేదని చెప్పింది. ఇదేమి కట్టు కథ కాదు. ఆ అమ్మాయిని నేను హగ్ చేసుకొని ఓదార్చాను” అంటూ రాసుకొచ్చింది. మరి ఎవరు ఆ హీరోయిన్..వేదించే హీరో ఎవరు అనేది మాత్రం వెల్లడించకపోయేసరికి అంత ఎవరబ్బా..అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
!! ॐ नमो हनुमते भय भंजनाय सुखम् कुरु फट् स्वाहा ।। !!⠀
TAMILNADU#womensupportingwomen pic.twitter.com/QgYxjfYA7I
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 17, 2024
Read Also : Donlee : స్పిరిట్ లో డాన్ లీ.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్..!