Varun Tej : మట్కా తర్వాత వరుణ్ తేజ్ సినిమా ఏంటో తెలుసా.. ఈసారి అలా ట్రై చేస్తున్నాడా..?
Varun Tej ఈసారి థ్రిల్లర్ ని నమ్ముకుంటున్నాడని తెలుస్తుంది. మరి రాబోయే సినిమా అయినా మెగా హీరోకి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుందని
- By Ramesh Published Date - 09:39 PM, Sat - 16 November 24

మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Te) మట్కా సినిమాతో నిరాశ పరిచాడు. కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజై ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఐతే మట్కా తర్వాత వరుణ్ తేజ్ చేసే సినిమా ఏదవుతుంది అని తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే మట్కా ఇలా రిలీజైందో అలా వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధి (Merlapaka Gandhi) డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతుందని టాక్. వరుణ్ తేజ్ ఇప్పటివరకు ఆ జోనర్ టచ్ చేయలేదు. కెరీర్ లో డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న వరుణ్ తేజ్ వాటికి తగిన ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు.
ఐతే వరుణ్ తేజ్ ఈసారి థ్రిల్లర్ ని నమ్ముకుంటున్నాడని తెలుస్తుంది. మరి రాబోయే సినిమా అయినా మెగా హీరోకి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కెరీర్ చూస్తే ఒక సినిమాతో మరో సినిమా సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఐతే వరుణ్ తేజ్ ఈసారి పకడ్బందీ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది.
మట్కా (Matka) రిజల్ట్ తో డిజప్పాయింట్ అయిన వరుణ్ తేజ్ ఈసారి ఎలాగినా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
Also Read : Nani : నాని సుజిత్ ఓ మల్టీస్టారర్.. అదిరిపోయే అప్డేట్..!