Pooja Hegde Upset: 2022లో ఘోరంగా నిరాశ పర్చిన టాలీవుడ్ బుట్టబొమ్మ!
పూజాహెగ్డే (Pooja Hegde) 2022లో ఘోరంగా నిరాశపర్చింది. నాలుగు సినిమాలు చేసినప్పటికీ, ఏమాత్రం హెల్ప్ కాలేదు.
- Author : Balu J
Date : 26-12-2022 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తోంది. అటు నటన, ఇటు గ్లామర్ తో తానేంటో ప్రూవ్ చేసుకుంది. 2021లో నటించిన చిత్రాలన్నీ పూజకు పేరు తీసుకొచ్చాయి. ఈ ఏడాది మాత్రం పూజా (Pooja Hegde) నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అవన్నీ ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. మొదట, ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ చిత్రం “రాధేశ్యామ్” విడుదలైంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది.
ఆ తర్వాత తలపతి విజయ్ “బీస్ట్” లో కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కేవలం అందులోని పాట మాత్రమే హైలైట్ అయ్యింది. అయితే విజయ్‌కి ఉన్న ఫాలోయింగ్ కారణంగా కొంచెం హెల్ప్ అయ్యింది. ఆ తర్వాత రెండు వారాలకే విడుదలైన పూజా హెగ్డే “ఆచార్య” (Acharya) రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్ సరసన జతకట్టింది. ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే లేకపోవడం ఆచార్య కూడా మెప్పించలేకపోయంది. టాలీవుడ్ ‘గోల్డెట్ బ్యూటీ’గా పేరు పూజా ఐరన్ లెగ్ గా మారుతోంది. 2022 ఏమాత్రం కలిసిరాకపోవడంతో పూజా (Pooja Hegde) కూడా అప్ సెట్ అయ్యింది.
Also Read: Marriages: మద్యానికి బానిసైన వ్యక్తికి పెళ్లి చేయొద్దు!