Pooja Hegde : పూజా బేబీ లవర్ అతనేనా.. కారులో అడ్డంగా బుక్కైన అమ్మడు వీడియో వైరల్..!
Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాలు చేయకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తోనో లేక వేరే వాటితోనే వార్తల్లో ఉంటుంది. గుంటూరు కారం ఛాన్స్ మిస్సైన దగ్గర నుంచి పూజా హెగ్దే ఒక్కటంటే ఒక్క తెలుగు
- By Ramesh Published Date - 10:58 AM, Mon - 1 April 24

Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే సినిమాలు చేయకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తోనో లేక వేరే వాటితోనే వార్తల్లో ఉంటుంది. గుంటూరు కారం ఛాన్స్ మిస్సైన దగ్గర నుంచి పూజా హెగ్దే ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలో నటించలేదు. అమ్మడికి కావాలని ఛాన్స్ ఇవ్వట్లేదా లేదా మరో కారణం ఏదైనా ఉందా అన్నది తెలియదు కానీ పూజా హెగ్దే ఒక్కసారిగా టాలీవుడ్ లో ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో పూజా హెగ్దే గురించి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు కొందరు.
ఇక లేటెస్ట్ గా పూజా హెగ్దే లవర్ తో అడ్డంగా బుక్కైనట్టు తెలుస్తుంది. కారులో తన బోయ్ ఫ్రెండ్ తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూజా హెగ్దే ఒక వ్యక్తితో కారు వెనక సీట్లో కూర్చుని ఉంది. వాళ్లిద్దరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పూజా బోయ్ ఫ్రెండ్ అతనే అంటూ మీడియా హడావిడి చేస్తుంది.
ప్రస్తుతం పూజా హెగ్దే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలతో ఏమో కానీ ఇలా పూజా వెరైటీగా న్యూస్ లో కనిపిస్తుంది. తెలుగు నుంచి ఈమధ్యనే ఒకటి రెండు ఆఫర్లు అందుకున్నట్టు తెలుస్తున్న పూజా హెగ్దేకి మళ్లీ ఇక్కడ లక్ కలిసి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. పూజా హెగ్దే బాలీవుడ్ యాక్టర్ రోహన్ మెహ్రా తో క్లోజ్ గా ఉంటుందని ఒక టాక్ ఉంది. అతనితో పూజా లవ్ లో ఉందని కూడా అంటుంటారు. మరి ఈ వీడియో కి పూజా బేబీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.
#Poojahegde with her boy friend 💔pic.twitter.com/JhtUYaISm8
— Kolly Censor (@KollyCensor) March 31, 2024