Pongal Movies : సంక్రాంతి సినిమాలు వేటికవే ప్రత్యేకం..!
Pongal Movies 2024 సంక్రాంతి రేసులో దిగేందుకు సినిమాలన్నీ రెడీ అవుతున్నాయి. పొందల్ రేసులో స్టార్ సినిమాల మధ్య ఫైట్ తెలిసిందే
- By Ramesh Published Date - 03:23 PM, Tue - 19 December 23

Pongal Movies 2024 సంక్రాంతి రేసులో దిగేందుకు సినిమాలన్నీ రెడీ అవుతున్నాయి. పొందల్ రేసులో స్టార్ సినిమాల మధ్య ఫైట్ తెలిసిందే. టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి సినిమాల పండుగ ఉండాల్సిందే. అభిమాన నటుడి సినిమా థియేటర్ లో సందడి చేస్తే పండుగ శోభ మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో 2024 సంక్రాంతికి సినిమాల హంగామా ఓ రేంజ్ లో ఉండబోతుంది. ఈసారి స్టార్ సినిమాలతో పాటుగా చిన్న సినిమాలు కూడా బరిలో దిగుతున్నాయి.
ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం విక్టరీ వెంకటేష్ సైంధవ్ కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. వీటితో పాటుగా మాస్ మహరాజ్ రవితేజ ఈగల్ కూడా సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమాల మధ్యలో ప్రశాంత్ వర్మ తేజ సజ్జా చేస్తున్న హనుమాన్ మూవీ కూడా సంక్రాంతికే వదులుతున్నారు.
Also Read : Vikram Tangalaan : విక్రమ్ సినిమాలకే ఎందుకిలా జరుగుతుంది.. వాటి బాటలోనే తంగళాన్..!
ఈ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. అయితే మహేష్ పొంగల్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో మహేష్ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. ఆ తర్వాత అన్ని సినిమాలు వరుసగా వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమా పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది అన్నది చూడాలి.
మహేష్, వెంకటేష్, నాగార్జున, రవితేజ, తేజ సజ్జా తమ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాల్లో ఏ సినిమా ఫైనల్ విన్నర్ గా నిలుస్తుంది అన్నది తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.
We’re now on WhatsApp : Click to Join