Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై పోలీసుల విచారణ
- By Balu J Published Date - 01:21 PM, Thu - 21 December 23

Rashmika Mandanna: ఇటీవల నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఇది దేశమంతటా ఆందోళన కలిగించింది. డిజిటల్ యుగం ముఖ్యంగా డీప్‌ఫేక్ టెక్నాలజీ మహిళా సెలబ్రిటీలకు అనేక సవాళ్లను విసురుతోంది అనే దానిపై చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన పలువురు రష్మిక మందన్నకు మద్దతుగా నిలిచారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ విషయంపై తన స్వరం పెంచారు.
ఇటీవలి నివేదికల ప్రకారం, డీప్‌ఫేక్ వీడియో వ్యాప్తి వెనుక ఉన్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. అయితే, వారు కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN)ని ఉపయోగించినట్లు తెలిసింది. పోలీసులు ప్రస్తుతానికి ఈ వ్యక్తులను విడుదల చేశారు అయితే వారి దర్యాప్తును కొనసాగించాలని, రాబోయే రోజుల్లో మరింత మందిని ప్రశ్నించాలని భావిస్తున్నారు.
ఇక వర్క్ ఫ్రంట్‌లో రష్మిక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన “యానిమల్” విజయం రష్మికకు మరింత ప్లసు అయ్యింది. ఈ నటి ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి “పుష్ప” సీక్వెల్ షూటింగ్ కోసం బిజీగా ఉంది. ఇటీవల ఈ బ్యూటీ మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ తో సందీప్ వంగా మూవీ, లేటెస్ట్ అప్డేట్ ఇదే