Payal Rajput Mangalavaram : బుల్లితెర మీద మంగళవారం అదిరిపోయే రేటింగ్..!
Payal Rajput Mangalavaram Rx100 తర్వాత పాయల్ రాజ్ పుత్ తో అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా మంగళవారం. ఈ సినిమాను ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్
- By Ramesh Published Date - 07:49 PM, Thu - 22 February 24

Payal Rajput Mangalavaram Rx100 తర్వాత పాయల్ రాజ్ పుత్ తో అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా మంగళవారం. ఈ సినిమాను ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ లో స్వాతి, సురేష్ వర్మ కలిసి నిర్మించారు. సైకలాజిల థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజైంది. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో కూడా ప్రేక్షకులను అలరించింది.
ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా డిజిటల్ ఆడియన్స్ ని అలరించగా లేటెస్ట్ గా సినిమా వరల్డ్ టెలిజివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన మంగళవారం సినిమా మంచి రేటింగ్స్ ను తెచ్చుకుంది. మంగళవారం సినిమా 7.21 టి.ఆర్.పి రేటింగ్ రాబట్టింది. ఈ సినిమాకు ఈ రేంజ్ రేటింగ్ రావడం గొప్ప విషయమని చెప్పొచ్చు.
సినిమా విజువల్స్, మేకింగ్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అజయ్ భూపతి ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందించారు.
Also Read : Sri Vishnu : శ్రీ విష్ణు ఓం భీం బుష్.. మరో జాతిరత్నాలు అవుతుందా..?