Chiranjeevi Birthday : అన్నయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు
- By Sudheer Published Date - 10:32 PM, Mon - 21 August 23

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోమవారం (ఆగస్ట్ 22) తన 68 వ పుట్టిన రోజు (Chiranjeevi Birthday) జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా అన్నయ్య కు తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి తన ప్రేమను వ్యక్తం చేసారు.
‘అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా… కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తోన్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అన్నయ్య’ అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం మెగా అభిమానులంతా (Mega Fans) చిరంజీవి బర్త్ డే వేడుకలకు (Chiranjeevi Birthday Celebrations) సిద్ధమయ్యారు. చిరంజీవి పుట్టిన రోజు అంటే మెగా అభిమానులకే కాదు చిత్రసీమ ప్రముఖులకు కూడా పెద్ద పండగే. పలు సేవ కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి సేవ కార్యక్రమాలు చేయబోతున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే..ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు రాజకీయాలపై దృష్టి సారించారు. రీసెంట్ గా వారాహి యాత్ర షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసారు. గతంతో పోలిస్తే జనసేన పార్టీ కి ప్రజల మద్దతు విపరీతంగా పెరుగుతుంది. ఇతర పార్టీ నేతలు సైతం జనసేన లోకి వస్తున్నారు. ఎన్నికల సమయం నాటికీ మరింతగా వలసలు రావడం ఖాయం అంటున్నారు.
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు – JanaSena Chief Shri @PawanKalyan@KChiruTweets#HBDMegastarChiranjeevi pic.twitter.com/ERu1BHiifr
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2023