Pawan Kalyan : పవన్ ఎవరికీ ఓకే చెపుతాడు..?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ నటించిన OG చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. దర్శకుడు సుజిత్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆశించిన యాక్షన్, స్టైల్, ఖరీస్మాను తెరపై సజీవం చేశారు
- By Sudheer Published Date - 10:54 AM, Tue - 28 October 25
పవన్ కల్యాణ్ నటించిన OG చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. దర్శకుడు సుజిత్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆశించిన యాక్షన్, స్టైల్, ఖరీస్మాను తెరపై సజీవం చేశారు. ఈ సినిమా విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టి, పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో పవన్ అభిమానుల్లో ఎనర్జీ మరింత పెరిగింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ జరుగుతున్నది. అయితే, ఆ తర్వాత పవన్ ఏ సినిమా చేస్తారనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది. ఆయన రాజకీయ బాధ్యతలు పెరగబోతున్న తరుణంలో, తక్కువ కాల్షీట్లలో పూర్తి చేయగల స్క్రిప్ట్ కోసం దర్శక-నిర్మాతలు పోటీపడుతున్నారని సమాచారం.
Karur Stampede : కరూర్ బాధితుల హృదయాలను గెలుచుకున్న విజయ్..ఏంచేసాడో తెలుసా..?
సురేందర్ రెడ్డితో పవన్ సినిమా గురించి వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పటికే పవన్ కోసం ఓ మాస్ కమర్షియల్ కథ సిద్ధం చేశారని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ముందస్తు కమిట్మెంట్ లో భాగంగా ఉండటంతో, పవన్ షెడ్యూల్ ఫ్రీ అవగానే దాని పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో దర్శకుడు సముద్రఖని కూడా పవన్ కోసం ప్రత్యేక కథ సిద్ధం చేశారని టాక్. ‘బ్రో’ విజయానంతరం ఇద్దరూ మరోసారి కలిసే అవకాశం ఉందని, ఈ కాంబినేషన్‌ని త్రివిక్రమ్ స్వయంగా ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్, పవన్ మధ్య ఉన్న స్నేహం, వర్కింగ్ రిథమ్ దృష్ట్యా ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం కూడా తేలికగా అనిపిస్తోంది.
ఇక ఇప్పుడు కొత్తగా వంశీ పైడిపల్లి పేరు వినిపిస్తోంది. విజయ్ తో వారసుడు చిత్రం తర్వాత వంశీ ఎక్కువగా ప్రాజెక్టుల నుండి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా ఆయన పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ కాంబినేషన్‌కు తిరిగి దిల్ రాజు సపోర్ట్ గా నిలుస్తున్నారు. దిల్ రాజు పవన్ తో ఇప్పటికే వకీల్ సాబ్ చేసిన అనుభవం ఉన్నందున, తక్కువ సమయ వ్యవధిలో పెద్ద మాస్-క్లాస్ సినిమాను పూర్తి చేసే నైపుణ్యం ఆయనకు ఉంది. 2029 ఎన్నికల ముందు పవన్ రెండు సినిమాలను పూర్తి చేస్తే, వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ నిజమవ్వడం ఖాయం. కానీ, ఒక సినిమా మాత్రమే చేసే అవకాశం ఉంటే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ కాంబినేషన్ అయినా సరే, OG విజయానంతరం పవన్ కల్యాణ్ నుండి అభిమానులు కొత్త సెన్సేషన్‌నే ఆశిస్తున్నారు.