Gabbar Singh : అప్పులు తీర్చడానికే పవన్ ‘గబ్బర్ సింగ్’ చేసాడట..
సినిమా మంచి హిట్ అవుతుంది. నీ లాభాలు నువ్వు తీసుకో. నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు. ఆ డబ్బుతో మా అన్నయ్య అప్పులు నేను తీర్చుకుంటానని చెప్పాడు
- By Sudheer Published Date - 11:16 PM, Wed - 4 September 24
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరియర్ లో గబ్బర్ సింగ్ (Gabbar Singh) మూవీ ఓ మైలు రాయి చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు అంటే దాదాపు పదేళ్లు గా ఒక్క హిట్ లేని పవన్ కు గబ్బర్ సింగ్ మూవీ ఊపిరి పోసిందనే చెప్పాలి. అలాంటి మూవీ అప్పులు తీర్చడానికే చేసినట్లు ఇప్పుడు బయటకు రావడం చర్చగా మారింది. హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో 2012 లో గబ్బర్ సింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా..బండ్ల గణేష్ నిర్మించారు. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో..బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్ల సునామి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా సెప్టెంబర్ 02 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. ఈ రీ రిలీజ్ కలెక్షన్లలో కూడా గబ్బర్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈ మూవీ పవన్ కళ్యాణ్ చేయడానికి కారణం..నాగబాబు (Nagababu) అప్పులు తీర్చడానికేనట..ఈ విషయాన్నీ స్వయంగా నాగబాబే తెలుపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నాగబాబు మాట్లాడుతూ..“సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ దగ్గర ‘దబాంబ్’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. ఫ్రాఫిట్స్ లో నా(నాగబాబు) అప్పులు తీర్చి, ఆ తర్వాత ఏమైనా తనకు రెమ్యునరేషన్ ఇస్తే ఇవ్వు. లేకపోతే లేదని కల్యాణ్ బాబు బండ్ల గణేష్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ప్రపోజల్ కు గణేష్ కూడా ఓకే చెప్పాడు. అయితే, ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి పవన్ ప్రపోజల్ మార్చాడు. సినిమా మంచి హిట్ అవుతుంది. నీ లాభాలు నువ్వు తీసుకో. నీకు ఇవ్వాలనిపించిన రెమ్యునరేషన్ నాకు ఇవ్వు. ఆ డబ్బుతో మా అన్నయ్య అప్పులు నేను తీర్చుకుంటానని చెప్పాడు. గణేష్ దానికి కూడా ఓకే చెప్పాడు. ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. మంచి లాభాలు వచ్చాయి. పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ తో నా అప్పులు అన్నీ తీర్చాడు. నా అప్పులు తీర్చేందుకే తమ్ముడు ‘గబ్బర్ సింగ్’ సినిమా చేశాడు. ఆ సమయంలో పవన్ కూడా ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాడు. అయినా, నాకు అప్పుల తిప్పలు తప్పించాడు” అని నాగబు చెప్పుకొచ్చారు. ఈ విషయం ఇంతకాలం చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్పినట్లో అని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Pawan Kalyan Hydra : హైడ్రా కరెక్టే.. కానీ మానవత్వం ఉండాలి – పవన్ కళ్యాణ్
Related News
Niharika : బాబాయ్ బాటలో కూతురు.. బుడమేరు ముంపు గ్రామాలకు నిహారిక సాయం..
బాబాయ్ పవన్ కళ్యాణ్ బాటలోనే నిహారిక కూడా అలాగే హెల్ప్ చేసింది.