HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Pawan Kalyan Warns Telugu Film Industry

Pawan Kalyan : నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan : ఎన్డీయే కూటమి (NDA Govt) ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా, సీఎం చంద్రబాబు(Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

  • By Sudheer Published Date - 08:42 PM, Sat - 24 May 25
  • daily-hunt
Pawan Warning
Pawan Warning

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) తాజాగా తెలుగు సినీ పరిశ్రమపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎన్డీయే కూటమి (NDA Govt) ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా, సీఎం చంద్రబాబు(Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అగ్ర నటులు, నిర్మాతలపై ఎలా ఇబ్బందులు పెట్టిందో అప్పుడే మరచిపోతున్నారని ప్రశ్నించారు. వ్యక్తులను చూడకుండా పరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తున్న తమ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞతా భావం చూపించకపోవడం బాధాకరమన్నారు.

Slot Booking: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్‌!

ప్రముఖ నిర్మాతలు తమ సినిమాల టికెట్ ధరలు పెంచేందుకు వ్యక్తిగతంగా అర్జీలు ఇస్తూ వస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలకు తావు లేదని, సంబంధిత విభాగ ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. నిర్మాతలు సంఘటితంగా ముందుకు వస్తేనే పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుందని మరోసారి గుర్తు చేశారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ‘రిటర్న్ గిఫ్ట్‌’ను తగిన రీతిలో స్వీకరిస్తానంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు.

ఇతర విభాగాల్లోనూ తన దృష్టిని సారించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలోని సినిమా హాళ్ల నిర్వహణ, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. థియేటర్లలో తినుబండారాలు, తాగునీటి సదుపాయాల కొరత, అధిక ధరలపై ప్రేక్షకుల ఫిర్యాదులను పరిశీలించారు. మల్టీప్లెక్స్‌ల నిర్వహణ, టికెట్ ధరలు, ఆహార పదార్థాల ధరలపై కఠినమైన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే సినిమా రంగంలోని 24 విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుందని సమాచారం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deputy CM Pawan Kalyan
  • Hari Hara Veera Mallu
  • Minister Kandula Durgesh
  • Pawan Kalyan Serious Warning
  • Telugu Film Industry
  • tollywood
  • tollywood producers

Related News

Ntr Neel

NTR-Neel : ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా నుంచి బయటకొచ్చిన సర్ప్రైజ్..!

NTR-Neel : జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Mahesh Babu

    Mahesh Babu : గౌతమ్ పుట్టినరోజున ఎమోషనల్ అయిన మహేశ్ బాబు

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd