Pawan Kalyan : తమిళ్ స్టార్ విజయ్ కు పవన్ రాజకీయ సలహా.. ఏమని ఇచ్చారంటే..
పవన్ లాగే తమిళ్ స్టార్ విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
- By News Desk Published Date - 10:03 AM, Tue - 25 March 25

Pawan Kalyan : టాలీవుడ్ లో స్టార్ హీరో స్థాయిలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు కష్టాలు పడ్డా గత ఎన్నికల్లో 100 శాతం సక్సెస్ రేట్ సాధించి ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో చర్చగా మారాడు. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ ఏపీలో అధికార కూటమిలో భాగమై ఉంది. పవన్ కి దేశవ్యాప్తంగా NDA కూటమితో బాగా పేరొచ్చింది.
పవన్ లాగే తమిళ్ స్టార్ విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ తమిళగ వెట్రి కగజం అనే పార్టీ స్థాపించి 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ అప్పుడప్పుడు సభలు పెడుతున్నాడు. విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాక పూర్తిగా ప్రజల్లోనే తిరిగి 2026 ఎన్నికలకు సిద్ధం కానున్నాడు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కి పొలిటికల్ గా ఏమని సలహా ఇస్తారు అని అడగ్గా పవన్ సమాధానమిస్తూ.. విజయ్ సర్ కి నేను సందేశం ఇవ్వడానికి ఏం లేదు. ఆయనకు అనుభవం ఉంది, ఆయన ప్రయాణం ఆయన చేస్తున్నారు. కానీ నేను ఏదైనా చెప్పాలి అంటే ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం నిలబడటం ముఖ్యం. రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. మన లక్షాన్ని సాధించడానికి మనం నిలబడాలి. విజయ్ తన పార్టీని గ్రౌండ్ స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. గెలుపు ఓటముల గురించి తర్వాత ఆలోచించాలి. ముందు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ముఖ్యమైన విషయం అని చెప్పారు.
మరి పవన్ కామెంట్స్ పై విజయ్ స్పందిస్తాడా ఆచూడాలి. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పవన్ బీజేపీ తరపున ప్రచారం చేస్తాడని సమాచారం.
Also Read : Anshu : నిజంగానే గాయం అయింది.. హాస్పిటల్లో హీరోయిన్.. సినిమా ప్రమోషన్స్ లో అలా కనపడేసరికి..