Anshu : నిజంగానే గాయం అయింది.. హాస్పిటల్లో హీరోయిన్.. సినిమా ప్రమోషన్స్ లో అలా కనపడేసరికి..
తాజాగా అన్షు దానిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
- By News Desk Published Date - 09:39 AM, Tue - 25 March 25

Anshu : మన్మధుడు ఫేమ్ హీరోయిన్ అన్షు ఓ నాలుగు సినిమాలు చేసి సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిన అన్షు ఇటీవల సందీప్ కిషన్ మజాకా సినిమాలో కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చింది. మన్మధుడు సినిమా హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో అంతా ఆసక్తికనబరిచారు.
ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అన్షు రీ ఎంట్రీ తర్వాత మరింత పాపులర్ అయింది. వరుస ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ కి దగ్గరైంది. అయితే మజాకా సినిమా ప్రమోషన్స్ లో అన్షుకి తల మీద దెబ్బ ఉన్నట్టు, బ్యాండేజ్ వేసుకొని కనిపించింది. అప్పుడు దాని గురించి ఏం క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది అది సినిమా ప్రమోషన్స్ కోసం స్క్రిప్ట్ అని కూడా అన్నారు.
తాజాగా అన్షు దానిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన తలకు తగిలిన దెబ్బ, దాని కోసం ఆమె హాస్పిటల్ లో ఉండటం.. తన తలకు బ్యాండేజ్ వేయడం.. ఈ ఫొటోలన్నీ ఉన్నాయి.
ఈ వీడియోని షేర్ చేసి అన్షు.. ఇది కెమెరా కోసం చేసింది కాదు. ఇది నిజంగానే జరిగిన గాయం. ఓ నెల క్రితం ఓ చేదు సంఘటన జరిగింది. ఆ ఘటనతో ఇలా గాయమైంది. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ సపోర్ట్ తో నేను దాన్నుంచి బయటపడ్డాను. ప్రస్తుతం నేను కోలుకున్నాను. నా కంబ్యాక్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటూ పోస్ట్ చేసింది.
దీంతో అన్షుకి నెల రోజుల క్రితం ఏదో జరిగినట్టు, దానివల్లే ఆ గాయం అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కోలుకుందనే చెప్తుంది. మరి ఏం జరిగింది, దేని వల్ల గాయం అయింది అనేది మాత్రం చెప్పలేదు అన్షు. ఇక రీ ఎంట్రీలో మరిన్ని సినిమాలు చేస్తుందనే సమాచారం.
Also Read : Soniya Singh : డ్రీం కార్ కొన్నానంటూ సోనియా సింగ్ ఎమోషనల్ పోస్ట్.. ఏకంగా బెంజ్ కార్..