OG Movie : భారీ ధరకు అమ్ముడుపోయిన పవన్ ‘ఓజి’ మూవీ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..?
భారీ ధరకు అమ్ముడుపోయిన పవన్ 'ఓజి' మూవీ ఓటీటీ రైట్స్. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట.
- By News Desk Published Date - 11:31 AM, Fri - 7 June 24
![OG Movie : భారీ ధరకు అమ్ముడుపోయిన పవన్ ‘ఓజి’ మూవీ ఓటీటీ రైట్స్.. ఎంతంటే..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-OG-Movie-OTT-rights-bagged-by-Netflix-with-huge-amount.jpg)
OG Movie : పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత మళ్ళీ మరోసారి ఓ గ్యాంగ్ స్టార్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 90’s బ్యాక్డ్రాప్ లో పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఓజి’ అనే పవర్ఫుల్ టైటిల్ ని పెట్టారు. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మిగతా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎదురు చూస్తుంది.
మరి పొలిటికల్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న పవన్.. ఈ మూవీకి ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి. కాగా ఈ పాలిటిక్స్ వల్ల పవన్ పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాకముందే, పవన్ పేరు నేషనల్ వైడ్ వినిపించడంతో.. తన రాబోయే సినిమాలకు పెద్ద ప్లస్ కాబోతుంది. దీంతో పవన్ సినిమాలకు భారీ బిజినెస్ జరుగుతుంది. ముఖ్యంగా ఓజి మూవీగా ఓ రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది.
ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని వ్యక్తుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకుంది. ఇక ఈ హైప్ కి పవన్ పొలిటికల్ ఫేమ్ కూడా తోడవ్వడంతో మరింత ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుందట. దాదాపు రూ.92 కోట్ల చెల్లించి ఓజి ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. ఓటీటీ బిజినెసే ఈ రేంజ్ లో జరిగితే.. ఇక థియేట్రికల్ బిజినెస్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి.
కాగా ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు ఈ మూవీని వాయిదా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారట.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Pawan Kalyan : మరియమ్మ కు ఆటో గిఫ్ట్ ఇచ్చిన పవన్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/pawan-gift.jpg)
Pawan Kalyan : మరియమ్మ కు ఆటో గిఫ్ట్ ఇచ్చిన పవన్
పవన్ గెలిచిన తర్వాత ఒకరోజు రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో స్వీట్లు కొని చుట్టుపక్కల వారికి పంచి పెట్టింది