Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Pawan Kalyan Launched Vishwaksen Next Film

Pawan Kalyan: పవన్ క్లాప్ తో ‘విశ్వక్ సేన్ – ఐశ్వర్య అర్జున్’ మూవీ షురూ!

విశ్వక్ సేన్ కథానాయకుడి గా ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక గా యాక్షన్ కింగ్ చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది.

  • By Balu J Published Date - 05:52 PM, Thu - 23 June 22
Pawan Kalyan: పవన్ క్లాప్ తో ‘విశ్వక్ సేన్ – ఐశ్వర్య అర్జున్’ మూవీ షురూ!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడి గా ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక గా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15లో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. తొలి షాట్ కి వెటరన్ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్ ని హ్యాండోవర్ చేశారు. వీరితో పాటు బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై టీమ్ కి బెస్ట్ విశేష్ అందించారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అర్జున్ గారు కలవాలని అడిగితే షాక్ అయ్యా. ఎందుకో అర్ధం కాలేదు. ‘నేను డైరెక్ట్ చేస్తున్న కథ చెప్తా విను’ అనగానే చాలా సర్ ప్రైజ్ అయ్యా. ఇది నా విష్ లిస్టులో వున్న సినిమా. అంత గొప్ప కథ. ఈ సినిమా కథ అన్నిటికంటే పెద్దగా కనిపించింది. ఈ కథకు నన్ను ఎంపిక చేసిన అర్జున్ గారికి ధన్యవాదాలు. మా అమ్మగారు అర్జున్ గారికి పెద్ద అభిమాని. తెలుగు సరిగ్గా రాదని చెబుతూనే ఐశ్వర్య అద్భుతమైన తెలుగు మాట్లాడారు. నన్ను, అర్జున్ గారిని డామినేట్ చేయడానికి ఐశ్వర్య రెడీ అవుతున్నట్లుగా వుంది. రవి బసూర్ గారితో ఇంత త్వరగా సినిమా చేస్తానని అనుకోలేదు. బుర్రా సాయి మాధవ్ గారితో పని చేయడం ఆనందంగా వుంది. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, రాఘవేంద్రరావు గారికి, విష్ణు గారికి, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు” తెలిపారు.

అర్జున్ సర్జా మాట్లాడుతూ… 1984లో ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది. కానీ చేయనని చెప్పాను. దర్శకుడు కారణం అడిగితే నాకు యాక్టింగ్ తెలీదని చెప్పాను. మేము నేర్పిస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తర్వాత తెలుగు భాష రాదని చెప్పాను. అదంతా మేము చూసుకుంటామని చెప్పారు. ఆ సినిమా పేరు మా పల్లెలో గోపాలుడు. ఆ దర్శకుడు మా గురువు గారు కోడి రామకృష్ణ గారు. నిర్మాత భార్గవ్ ఆర్ట్ ఫిల్మ్స్ గోపాల్ రెడ్డి గారు.ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్. నా గురువు గారిని తలుచుకుని ఈ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టడం ఆనందం వుంది. ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమకి నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ ని పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. తను ఒక తమిళ్ సినిమా, నా దర్శకత్వంలో ఒక కన్నడ సినిమా చేసింది. ఇప్పుడీ తెలుగు సినిమా చేయబోతుంది. తను చాలా డెడికేటెడ్ గా పని చేస్తుంది. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కష్టపడి పని చేస్తుందనే నమ్మకం వుంది. ప్యాషన్, హార్డ్ వర్క్, భయం ఉంటేనే ఇక్కడ నిలబడగలమని తనకు చెబుతుంటాను. డబ్బులు ఇచ్చి ప్రేక్షకులు సినిమా చుస్తున్నారనే భయం ఆర్టిస్ట్ లో ఉంటేనే విజయం సాధిస్తారని చెప్తాను. పరిశ్రమలో నాకు 42 ఏళ్ళు. ఈ ప్రయాణంలో ఇండస్ట్రీ నవ్వు, ఏడుపు, నొప్పి, విజయం, అపజయం ఇలా అన్నీ నేర్పించింది. ఇలాంటి అద్భుతమైన పరిశ్రమకి నా కుమార్తెని పరిచయం చేస్తున్నందుకు చాలా గర్వంగా వుంది.

ఇది చాలా ఫీల్ గుడ్ మూవీ. చాలా అరుదైన జోనర్. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటులు, టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అందరికీ ఇంత నమ్మకం వున్నపుడు ఖచ్చితంగా అద్భుతమైన సినిమా చేయాలనే భయం వుంది. మా హీరో విశ్వక్ వండర్ ఫుల్ హీరో. ఈ కథ విన్నాక పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అని హీరో విశ్వక్ చెప్పారు. అప్పుడు ఇంకా భాద్యత పెరిగినట్లనిపించింది. వందశాతం మంచి సినిమాని తీస్తాను. ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ ఫీల్ గుడ్ మూవీ. దర్శకుడిగా ఇది 13వ సినిమా. నిర్మాతగా 15వ సినిమా. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ఆయన మాటలతో కథ మరోస్థాయికి వెళుతుంది. బాలమురగన్ గారు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా వుంటుంది. ”కేజీఎఫ్’ తో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టరైన రవి బసూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి మరో మెయిన్ పిల్లర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా లాంచింగ్ కి రావడం, ‘మీరు చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు. మీతో పాటు వుంటాం”అని ఆయన చెప్పడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో నటులకి, టెక్నిషియన్లకు మంచి స్కోప్ వుంది. ఈ రోజు నా భార్య కూడా ఈ వేడుకలో వుండటం ఆనందంగా వుంది. నా సక్సెస్ ఫుల్ జీవితానికి, ఆనందానికి ప్రధాన కారణం నా భార్య. ఇన్నేళ్ళుగా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. నా కుమార్తెని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక మంచి సినిమాని తెలుగు చిత్ర పరిశ్రమకి ఇస్తాననే నమ్మకం వుంది. త్వరలోనే టైటిల్ ని ప్రకటిస్తాం.” అన్నారు.

ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. మా నాన్న గారు దర్శకత్వంతో పాటు నిర్మిస్తున్నారు. ఇది నాకు భాద్యత. మా నాన్నకి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నన్ను తెలుగు పరిశ్రమలో పరిచయం చేస్తారని అనుకోలేదు. ఇది నాకు బిగ్ సర్ప్రైజ్. అలాగే ఒక భాద్యత. మీ అందరి అంచనాలకి తగ్గట్టు కష్టపడి పని చేస్తాను. గ్రేట్ టీం కుదిరింది, విశ్వక్ గారు , రవి బసూర్, సాయి మాధవ్ గారు, బాలమురగన్ వీరందరితో కలసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. నాన్నగారిని ఇన్నేళ్ళు ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. నన్ను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సాయి మాధవ్‌ బుర్రా మాట్లాడుతూ.. అర్జున్ దర్శకత్వం వహిస్తున్న మొదటి తెలుగు సినిమా, వారి కుమార్తె తెలుగు లో పరిచయం అవుతున్న చిత్రానికి మాటలు రాసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా అద్భుతమైన కథ ఇది. ప్రతి టెక్నిషియన్ తనని తాను ఆవిష్కరించుకునే అవకాశం కథకి మాటలు రాసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా వుంది. విశ్వక్ నా అభిమాన హీరో. విశ్వక్ గారి ఒక సినిమాకి పని చేస్తున్నా. ఆ సినిమా ఇంకా సెట్స్ కి వెళ్ళకముందే మరో సినిమాకి రాసే అవకాశం రావడం హ్యాపీగా వుంది. అర్జున్ గారు గ్రేట్ యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. ఇంతమంచి కాంబినేషన్ లో వర్క్ చేయడం సంతోషంగా వుంది. ప్రతి మాట బావుండేలా రాయడానికి ప్రయత్నిస్తా” అన్నారు.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ చూసి సర్ ప్రైజ్ అయ్యాను. ”మీరు ఇక్కడ ఏంటి ?’ అని అడిగాను. అర్జున్ గారు అంటే ఇష్టం. అద్భుతమైన వ్యక్తి. ఆయన పక్కన నిల్చోవాలనిపించింది” అన్నారు. ఇది అర్జున్ గారు ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న మంచితనం. తన కుమార్తెని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇంకా నచ్చింది. ఈ సినిమాలో నేను కూడా ఉంటా. ఐతే డబ్బులు మాత్రం తీసుకోనని కండీషన్ పెట్టా(నవ్వుతూ). ఐశ్వర్య ని మీ అందరూ ఆదరించాలి. విశ్వక్ ఎనర్జీటిక్ హీరో. తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకొని ముందుకు వెళ్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ పని చేస్తుంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

Tags  

  • arjun
  • Pawan Kalyan
  • prakash raj
  • vishwak sen

Related News

BJP Janasena : పొత్తు పొత్తే..అవ‌మానం మామూలే!

BJP Janasena : పొత్తు పొత్తే..అవ‌మానం మామూలే!

`జ‌నసేన‌తో క‌లిసే ఉన్నాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుతో వెళ‌తాం..` అంటూ తాజాగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు.

  • Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

    Jagan and Modi Tour: మోడీ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌నే మోనార్క్!

  • Pawan Kalyan: పవన్ ఆశ, ఆశయం నెరవేరడానికి ఆ 3000 సామాజికవర్గాలు మద్దతిస్తాయా?

    Pawan Kalyan: పవన్ ఆశ, ఆశయం నెరవేరడానికి ఆ 3000 సామాజికవర్గాలు మద్దతిస్తాయా?

  • Prakash Raj Tweet: మోడీ టూర్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు

    Prakash Raj Tweet: మోడీ టూర్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు

  • Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!

    Pawan Kalyan & Sai Dharam Tej: మెగా మల్టీస్టారర్.. పవన్ కళ్యాణ్ తో సాయితేజ్!

Latest News

  • Music Maestro Ilayaraja: సంగీత సామ్రాజ్యాధిపతికి వందనం

  • Chandrababu : రాజంపేటపై చంద్ర‌బాబు ఫోక‌స్, ఎంపీ అభ్య‌ర్థి ఆయ‌నే?

  • Vitamin D : విటమిన్ డి సప్లిమెంట్స్ అతిగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు…ఈ సమస్యలు తప్పవు..!!

  • Safran : తెలంగాణ‌కు మ‌రో భారీ ప‌రిశ్ర‌మ‌… వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో..!

  • Cock Fight : హైదరాబాద్ శివారులో కోడిపందాలు…21మంది అరెస్టు…పరారీలో చింతమనేని..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: