HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Pawan Kalyan Khushi Memorable Love Story That Will Be Evergreen

Pawan Kalyan Kushi: ఎప్పటికీ గుర్తుండుపోయే చిరస్మరణీయ ప్రేమకథ ‘ఖుషి’

తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది ఖుషి

  • By Balu J Published Date - 03:53 PM, Mon - 26 December 22
  • daily-hunt
Kushi rereleased
Kushi

తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘ఖుషి’ (Kushi). పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), భూమిక చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రానికి.. మణిశర్మ సంగీతం అందించగా, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. విడుదల సమయంలో ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఒకటైన ఖుషి (Kushi).. రెండు దశాబ్దాల తర్వాత కూడా అదే కొత్త అనుభూతినిస్తోంది.

రీ-రిలీజ్ కోసం విడుదల చేసిన ఖుషి ప్రత్యేక ట్రైలర్ అభిమానులను రెండు దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఈ సినిమా వారిపై చూపిన ప్రభావాన్ని, థియేటర్లలో సృష్టించిన ప్రభంజనాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. బాయ్స్, ప్రేమికుల రోజు, జీన్స్, నాయక్ వంటి ట్రెండ్‌సెట్టింగ్ చిత్రాలకు పేరుగాంచిన లెజెండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం ‘ఖుషి (Kushi) తో తనకున్న జ్ఞాపకాలను, ఖుషి కి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

*ఖుషి చిత్రం మరియు ఎస్‌.జె. సూర్య ప్రతిభ
ఇద్దరు వ్యక్తుల ఇగోల చుట్టూ తిరిగే సున్నితమైన కథ అయినప్పటికీ, ఖుషి బయటకు మాత్రం ఒక రెగ్యులర్ రొమాంటిక్ ఫిల్మ్ లా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది, అది మన ఆలోచనలను నిజాయితీగా వ్యక్తపరచకుండా ఆపుతుంది. ఖుషి విడుదలకు ముందే తమ్ముడు, తొలి ప్రేమ, బద్రి వంటి విజయాలతో పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ గా ఉన్నారు.అయితే దర్శకుడు ఎస్‌.జె. సూర్య తన ప్రతిభను ఈ సినిమాలో చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ప్రతి ఫిల్మ్ మేకర్ కి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. ఎస్.జె. సూర్యలో అద్భుతమైన నటనా నైపుణ్యం కూడా ఉంది. అందుకే అతను ఇప్పుడు నటుడిగా బాగా ప్రాచుర్యం పొందాడు. ఎస్‌జె సూర్య నాకు కథ చెప్పినప్పుడు, నాకు బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ అయితే స్క్రిప్ట్ విని ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఖుషి చిత్రానికి అన్నీ చక్కగా కుదిరాయి. మేమంతా ఒక టీమ్ లా పనిచేశాము. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా పని చేయడాన్ని మర్చిపోలేను.

*యే మేరా జహాన్ – పవన్ కళ్యాణ్ యొక్క అద్భుతమైన ఆలోచనలలో ఒకటి
సినిమాలో పాత్ర యొక్క కోల్‌కతా నేపథ్యానికి సరిపోయేలా తెలుగు చిత్రంలో పూర్తి స్థాయి హిందీ పాటను కంపోజ్ చేయాలనే నిర్ణయం పవన్ కళ్యాణ్ అద్భుతమైన ఆలోచనలలో ఒకటి. నాకు ఆ ఆలోచన చాలా నచ్చింది. వెంటనే అబ్బాస్ టైర్‌వాలా ను తీసుకువచ్చి యే మేరే జహాన్‌ పాటను రాయించాము. యే మేరే జహాన్ రెగ్యులర్ ఇంట్రడక్షన్ సాంగ్ కాదు. ఇది దేశభక్తిని ప్రతిభింబిస్తుంది. దేశాన్ని ప్రేమించే ఒక యువకుడి గురించి ఉంటుంది. అతను తన చుట్టూ ఏదైనా తప్పు చూసినప్పుడు ప్రజల కోసం నిలబడతాడు. కొందరు రాజకీయ నాయకుల స్వభావాన్ని కూడా ప్రశ్నిస్తాడు. అబ్బాస్ టైర్‌వాలా కేవలం ఒక గంటలో పాట రాశారు. ఇది చాలా వినూత్నమైన ఆలోచన, ఇది సంగీత ప్రియులందరి చేత ప్రశంసించబడింది. ఆ పాటకు అంతలా ఆదరణ లభించినందుకు పూర్తి క్రెడిట్ పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది.

*యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషి
పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఖుషికి ప్రధాన హైలైట్. పోరాటాలు ఏవీ బలవంతంగా చొప్పించినట్లు ఉండవు. సహజంగా రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో కలిసిపోయాయి. సినీ పరిశ్రమలో చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ ‘లల్లూ అంకుల్ మాలూమ్ తెరేకు’ లాంటి డైలాగ్ చెప్పే సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అయితే, థియేటర్లలో దీనికి ఆ స్థాయి స్పందన వస్తుందని నేను ఊహించలేదు. మాస్ పల్స్ గురించి పవన్ కళ్యాణ్ ఉన్న అవగాహనను స్పష్టంగా చూపించింది. తన కెరీర్‌లో ఒకే ఒక్క సినిమా డైరెక్ట్ చేసినప్పటికీ, అతనిలో మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నాడని నేను ఎప్పుడూ నమ్ముతాను.

*సినిమాలో ఇతర హైలైట్స్
ఖుషీ సినిమాకు కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ భూమిక నడుము గురించి మాట్లాడటం, క్లైమాక్స్‌కు ముందు అలీతో జానపద పాట పాడటం వంటివి.. అద్భుతంగా రాసిన కథకి మరింత బలాన్నిచ్చాయి. మణిశర్మ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యి.. సినిమాకు చాలా హైప్ తీసుకొచ్చాయి. ఇక ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్‌ను చూసిన చాలా మంది.. తెలుగు చిత్రం పూర్తిగా కొత్త అనుభూతిని పంచేలా ఉందని ఆశ్చర్యపోయారు.

*ఖుషి ప్రత్యేకత
నా దృష్టిలో ఖుషి ఎప్పటికీ అద్భుతమైన కథే. వాయిస్‌ఓవర్ ద్వారా కథను ముందే పరిచయం చేసినా.. ప్రేక్షకులలో ఆసక్తిని ఏమాత్రం తగ్గించకుండా చివరివరకు కూర్చునేలా చేసిన అరుదైన చిత్రం. విభిన్న నేపథ్యాలు మరియు ఆశయాలు ఉన్నప్పటికీ పాత్రల విధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని చెప్పబడింది. సిద్ధు విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటాడు. మధు తన తండ్రి చూసిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకుంటుంది. కానీ విధి వారి కోసం ఇతర ప్రణాళికలను వేసింది. వారి ప్రయాణంలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ఖుషి అనేది లైలా-మజ్ను, రోమియో-జూలియట్ వంటి ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే చిరస్మరణీయ ప్రేమకథ.

*ఖుషి – టైటిల్ వెనుక కథ
తమిళ వెర్షన్‌లో ఖుషీకి మొదట ముత్తమ్(ముద్దు) అనే పేరు పెట్టారు. ఎస్.జె. సూర్య దానిని ప్రేమ వ్యక్తీకరణగా భావించారు. ఈ టైటిల్ థియేటర్లలోని ప్రేక్షకులను దూరం చేస్తుందని నేను భావించాను. ఖుషి టైటిల్ ని అనుకోకుండా అంగీకరించాము. ఖుషి అనే పదం మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. భాష, ప్రాంతం, తరగతి అనే తేడా లేకుండా అందరికీ అర్థమవుతుంది. ఇది పర్షియన్ పదం అని చాలామందికి తెలియదు. 60వ దశకంలోనే మనకు ‘ఖుషీగా ఖుషీగా నవ్వుతూ’ లాంటి పాట ఉంది. ఆనందం అనేది ప్రతి మనిషి కోరుకునేది. ఖుషి అనే టైటిల్‌, ఈ ప్రేమకథ సంతోషకరంగా ముగుస్తుందని తెలియజేస్తుంది. టైటిల్ చాలా అర్థవంతంగా ఉంది కాబట్టి హిందీ వెర్షన్‌కు కూడా మారలేదు. ఆశ్చర్యకరంగా ఈ చిత్రానికి మొదటి చిరంజీవి చూడాలని వుందిలా చెప్పాలని ఉంది అనే టైటిల్ ఖరారు చేశాము. కథ ఒకరినొకరు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటుంది. అయితే వారి అహం ఆ ప్రేమను వ్యక్తపరచకుండా ఆపుతుంది. కాబట్టి ఇది సరిపోతుందని మేము అనుకున్నాము. అయితే ఓ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఖుషి టైటిల్‌ పెడదామని చెప్పారు. టైటిల్ మార్పుపై డిస్ట్రిబ్యూటర్లు సంతోషించలేదు. కానీ ఖుషి టైటిల్ కాబట్టి పెద్దగా అడ్డు చెప్పలేదు.

*ఖుషి తెలుగు, తమిళ వెర్షన్‌ల కోసం విభిన్నమైన క్లైమాక్స్‌ లు
తమిళ వెర్షన్ క్లైమాక్స్‌లో జంట కవలలకు జన్మనిచ్చినట్లు చూపించాలి అనుకున్నాము. అయితే అప్పటికే మేము మరో వెర్షన్ కి చిత్రీకరించాము. కొన్ని కారణాల వల్ల దానిని మార్చలేకపోయాం. తెలుగు వెర్షన్ కోసం మాత్రం దానిని అమలు చేసాము. తెలుగు క్లైమాక్స్ పట్ల నేను చాలా సంతోషించాను. 10 ఏళ్లలోపులో చాలా మంది పిల్లలకు జన్మనివ్వడం చాలా సరదాగా అనిపించింది.

*సినిమాకి సంబంధించిన ఇతర విశేషాలు
అప్పట్లో తెలుగు సినిమాలను తమిళనాడులో విడుదల చేయడంలో కొంత జాప్యం జరుగుతుండగా.. ఖుషి చిత్రం మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఒకే రోజు విడుదలైంది. మణిరత్నంతో సహా తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించారు. లండన్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ‘ఖుషి’నే. నా కుమారుడు అదే సమయంలో లండన్‌లో చదువుతున్నాడు. దాంతో ఖుషిని అక్కడ విడుదల చేయడానికి అతడి స్నేహితుడి సహాయం తీసుకున్నాం.

*ఖుషిని థియేటర్లలో మళ్లీ విడుదల చేయాలనే నిర్ణయం
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఖుషీని విడుదల చేయాలని అనుకున్నాం. కానీ జల్సాతో పోటీ పడకూడదన్న ఉద్దేశంతో ఆగిపోయాం. బాబీ నుండి క్రిష్ వరకు చాలా మంది ప్రస్తుత తరం దర్శకులు.. ఖుషి విడుదల సమయంలో అభిమానులుగా థియేటర్లలో ఈలలు వేశారు. నేను నిర్మించిన చాలా చిత్రాలలో జీన్స్, ప్రేమికుల రోజు, బాయ్స్, ఖుషి ఇలా ఎన్నో కథలు ఈ తరానికి కూడా నచ్చేలా, కొత్తగా ఉంటాయి.
హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేయడం థియేటర్ యజమానులకు, పంపిణీదారులకు ఎంతో సహాయం చేస్తుంది. అలాగే అభిమానులకు ఐకానిక్ చిత్రాలను సెలెబ్రేట్ చేసుకోవడానికి, ఆ జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకోవడానికి మరో అవకాశం వస్తుంది. ఇప్పటికీ ఖుషీలోని ‘చెలియ చెలియా’, ‘ప్రేమంటే సులువు కాదురా’ పాటలను గుర్తు చేసుకునే వారిని ఎందరినో చూశాను. నా సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.

*ఆడువారి మాటలకు పాట వెనుక కథ
ఆడువారి మాటలకు.. లాంటి పాపులర్ సాంగ్ ని రీమిక్స్ చేయాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. మొదట్లో మురళీధర్ ట్రాక్ వెర్షన్ మాత్రమే పాడాల్సి ఉండగా, పవన్ కళ్యాణ్ అతని వెర్షన్‌ను ఇష్టపడి నేరుగా ఆల్బమ్‌కి ఖరారు చేశారు. మురళి ఇప్పుడు మన మధ్య ఉండకపోవచ్చు కానీ ఆ పాటతో తన కెరీర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లినందుకు మా టీమ్‌కి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండేవాడు. ఆ పాటలో పవన్ కళ్యాణ్ చేసిన చిన్న డ్యాన్స్ మూమెంట్స్ పాటని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల, కొత్త తరానికి క్లాసిక్ సాంగ్‌ని పరిచయం చేయడంతోపాటు వారి అభిరుచి కూడా మెరుగు పడుతుంది.

*చివరిగా ఖుషి చిత్ర బృందం గురించి
భూమికా చావ్లా కొత్తగా వచ్చినప్పటికీ చాలా క్యూట్‌గా నటించి పాత్రకు న్యాయం చేసింది. సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారు. సినిమాలో నటీనటులను అందంగా చూపించారు. ఇక ఖుషి కోసం పని చేస్తున్నప్పుడు, అది మాకు పనిలా అనిపించలేదు. తెలియకుండా అలా జరిగిపోయింది. చిరస్మరణీయమైన చిత్రాలు అప్రయత్నంగానే తయారవుతాయి. ఖుషి దానికి ఉత్తమ ఉదాహరణ.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kushi
  • latest tollywood news
  • Pawan Kalyan
  • Rerelesed

Related News

Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Pawan Kalyan : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పన్ను భారాన్ని తగ్గించే దిశగా తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా స్వాగతించారు.

  • Sugali Preethi Case Cbi

    Sugali Preethi Case : సీబీఐకి సుగాలి ప్రీతి కేసు

  • Ustaad Bhagat Singh

    Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి బిగ్ అప్డేట్‌.. అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ పోస్ట‌ర్‌!

  • Pawan- Bunny

    Pawan- Bunny: అల్లు అర‌వింద్ కుటుంబాన్ని పరామ‌ర్శించిన ప‌వ‌న్‌.. బ‌న్నీతో ఉన్న ఫొటోలు వైర‌ల్‌!

Latest News

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd