HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Introduces Kalapuram Artists

Kalapuram: ప‌వ‌న్ చేతుల మీదుగా ‘కళాపురం’ ట్రైలర్ రిలీజ్!

‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాదు..

  • Author : Balu J Date : 13-08-2022 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalapuram
Kalapuram

‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ ర‌స్టిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న క‌రుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. సాధారణ సినీ ప్రేక్ష‌కులే కాదు.. సినీ విమ‌ర్శ‌కులు సైతం క‌రుణ కుమార్ డిఫ‌రెంట్ సినిమాలను ఎంపిక చేసుకుని వాటిని తెర‌కెక్కిస్తోన్న తీరుని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌, ఆర్ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ర‌జనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు న‌టించారు.

ఇప్ప‌టికే విడుద‌లైన క‌ళాపురం సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, పోస్ట‌ర్స్, సాంగ్‌ అన్నీ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచాయి. ఇప్పుడీ అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేలా మేక‌ర్స్ క‌ళాపురం సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని చిత్ర యూనిట్‌ను అభినందించారు. 1 నిమిషం 57 సెక‌న్ల వ్య‌వ‌ధి ఉన్న ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌.. ఆ క్యారెక్ట‌ర్ ఛాలెంజెస్ ఏంటి అనే విష‌యాల‌ను కామెడీ కోణంలో ఆవిష్క‌రించారు. ఓ దర్శ‌కుడు, నిర్మాత క‌లిసి ఒక సినిమాను చేయాల‌నుకుంటారు. అయితే తాను ఉంటున్న క‌ళాపురం గ్రామంలో కొంత సినిమా షూటింగ్ చేయాల‌నే కండీష‌న్ మీద నిర్మాత సినిమాను స్టార్ట్ చేస్తాడు. అయితే డ‌బ్బు కోసం మ‌ధ్య‌లో పోలీసులు, విల‌న్ ఎంట్రీ ఇస్తారు. అలాంటి ప‌రిస్థితుల్లో ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి సినిమాను ఎలా పూర్తి చేశార‌నేదే సినిమా. స‌త్యం రాజేష్ ఇందులో డైరెక్ట‌ర్ పాత్ర‌ను పోషించారు.

ట్రైల‌ర్ చూస్తుంటే విజువ‌ల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌రుణ కుమార్ సినిమాలోని పాత్ర‌ల‌ను చూపించిన తీరు, దాని వ‌ల్ల వ‌చ్చే కామెడీ ప్రేక్ష‌కుల‌ను త‌ప్ప‌కుండా వన‌వ్విస్తుంది. స‌త్యం రాజేష్‌, చిత్రం శ్రీను, ర‌క్షిత్ అట్లూరి త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న క‌ళాపురం చిత్రం.. క‌రుణ కుమార్ రూపొందించిన చిత్రాల‌కు భిన్నంగా ఉంది. ఆగ‌స్ట్ 26న మూవీ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kalapuram
  • Pawan Kalyan
  • tollywood
  • trailer released

Related News

Pawan Praises Modi's Leader

Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

"పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్యవంతులు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని పోస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. తీరిక లేని షెడ్యూల్‌లో కూడా తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపినందుకు ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Allu Arjun appeal to Delhi high court for his privacy

    Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

  • Rajasthan : రేపు ప్రారంభం కాబోతున్న వేళ రూ.80,000 కోట్ల ప్రాజెక్టులో భారీ అగ్నిప్రమాదం

  • జపాన్‌లో భారీ భూకంపం!

  • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

  • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

Trending News

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd