Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా..?
Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఆయన పొలిటికల్ విక్టరీపై సూపర్ జోష్ లో ఉన్నారు. లాస్ట్ టైం రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక్కచోట కూడా గెలవని పవన్ కళ్యాణ్
- By Ramesh Published Date - 02:45 PM, Sun - 30 June 24

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఆయన పొలిటికల్ విక్టరీపై సూపర్ జోష్ లో ఉన్నారు. లాస్ట్ టైం రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక్కచోట కూడా గెలవని పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలవడమే కాదు డిప్యూటీ సీఎం గా కూడా అయ్యాడు. ఆయన సంకల్పమే ఆయన్ను ఇలా ఈరోజు ఆ కుర్చీలో కూర్చోబెట్టిందని చెప్పొచ్చు. ఐతే పొలిటికల్ గా పవన్ చేస్తున్న పనుల పట్ల సూపర్ హ్యాపీగా ఉన్న ఫ్యాన్స్ ఆయన సినిమాల విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. అందులో క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా అయితే నాలుగేళ్లు అవుతుంది. మధ్యలో క్రిష్ ఈ సినిమా వదిలి వేరే సినిమా మొదలు పెట్టాడు. హరి హర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ ఈ రెండు సినిమాలకు పవన్ డేట్స్ కావాల్సి ఉన్నాయి. ఆయన టైం ఇస్తే ఈ సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు.
ఓజీ ఆల్రెడీ సెప్టెమర్ 27 రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమా పూర్తి చేసేందుకు పవన్ ఇప్పుడప్పుడే టైం ఇవ్వలేడని తెల్సి సినిమా వాయిదా వేసుకున్నారు. ఓజీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియట్లేదు. మరోపక్క వీరమల్లు కోసం కూడా పవన్ మరో నెల రోజులు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. సో అది కూడా లేట్ అయ్యేలా ఉంది. మరి ఈ ఏడాది పవన్ సినిమా ఏదైనా వస్తుందా అంటే చెప్పడం కష్టమే అని అంటున్నారు. సో ఆ విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ తప్పేలా లేదని చెప్పొచ్చు.