HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Emotional Poet Posting On Gaddar In Social Media

Pawan Kalyan : గద్దర్‌పై ప్రత్యేక కావ్యం రచించి వినిపించిన పవన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో గద్దర్‌పై స్పెషల్ పోస్టులు..

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి, గద్దర్ కి ఎంతో మంచి అనుబంధం ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ గద్దర్ ని గుర్తు చేసుకుంటూ ఓ రెండు ఎమోషనల్ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

  • Author : News Desk Date : 07-08-2023 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan emotional poet posting on Gaddar in social media
Pawan Kalyan emotional poet posting on Gaddar in social media

ప్రజా గాయకుడు, విప్లవ నేత గద్దర్(Gaddar) నిన్న ఆదివారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం యావత్ తెలంగాణను విషాదంలో నింపింది. ఆయనకు అనేక మంది ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. నేడు హైదరాబాద్(Hyderabad) లో ఘనంగా అంతిమ యాత్ర నిర్వహించి ఆయన స్కూల్ వద్దే అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.

జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి, గద్దర్ కి ఎంతో మంచి అనుబంధం ఉంది. ఎన్నో సార్లు గద్దర్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు అని, నాకు ఆర్ధికంగా ఎన్నో సార్లు సహాయం చేశాడని, మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్పారు. పవన్ కూడా గద్దర్ గురించి అనేక సందర్భాల్లో చెప్పారు. గద్దర్ మరణ వార్త విన్నప్పట్నుంచి పవన్ శోక సంద్రంలోనే ఉన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కంటతడి పెట్టారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ గద్దర్ ని గుర్తు చేసుకుంటూ ఓ రెండు ఎమోషనల్ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఓ వీడియోలో.. నా అన్న ప్రజాయుద్ధ నౌక గద్దర్.. అంటూ స్వయంగా తన గొంతుతో వాయిస్ ఇస్తూ గద్దర్ గురించి కావ్యంలా చెప్పారు. పీడిత జనుల పాట గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్.. కోకిల పాట గద్దర్.. గుండెకు గొంతు వస్తే, బాధకు భాష వస్తే గద్దర్.. అన్నిటికి మించి నా అన్న గద్దర్.. జోహార్ అంటూ మరిన్ని లైన్స్ తో పవన్ తన బాధని తెలియచేశాడు.

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

అలాగే గతంలో గద్దర్.. తమ్ముడా పవన్.. అంటూ రాజకీయం గురించి చెప్పిన మాటలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ రెండు వీడియోల్ని చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేశారు పవన్. ఈ వీడియోలతో మరోసారి గద్దర్, పవన్ అధ్య ఉన్న అనుబంధం తెలుస్తుంది. ఇక ఈ వీడియోలకు పవన్, గద్దర్ అభిమానులు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pawan Kalyan (@pawankalyan)

 

 

Also Read : Gaddar : ఎట్టకేలకు గద్దర్ మృతిపై స్పందించిన మావోయిస్టు పార్టీ..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gaddar
  • gaddar passed away
  • Pawan Kalyan
  • Pawan Kalyan emotional
  • Pawan Kalyan emotional post

Related News

Pawan Kalyan Ustad Bhagat Singh Working stills released from Movie Unit Shootings not stopped with Chandrababu Arrest

Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

రాబోయే రోజుల్లో ఏవైనా సెలవు దినాలు కలిసి వస్తే తప్ప, ఈ 100 కోట్ల గ్రాస్ టార్గెట్ రీచ్ అవ్వడం సవాలుతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరియు సినిమాల మధ్య ఉన్న గ్యాప్ వల్ల అభిమానులు

    Latest News

    • Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ.300 తగ్గింపు ఎలాగంటే !!

    • Arava Sreedhar Issue : ఇదేనా పవన్ మీ ప్రశ్నించే గుణం..? – హర్ష వీణ

    • Trisha: విజయ్‌తో ప్రేమ లేకపోతే అర్థమే లేదంటూ త్రిష పోస్ట్

    • YCP : ఆ ఇద్దరి నేతలపై జగన్ కన్ను

    • Hyundai : హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్

    Trending News

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

      • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd