HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Pawan Kalyan Congratulated Karthi

Pawan Kalyan : హీరో కార్తీని అభినందించిన పవన్ కళ్యాణ్ ..

Pawan Kalyan : కార్తీ వేగంగా స్పందించిన తీరును, మన సంప్రదాయాల పట్ల ఆయన చూపిన గౌరవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు

  • By Sudheer Published Date - 08:55 PM, Tue - 24 September 24
  • daily-hunt
Pawan Wishe To Karthi
Pawan Wishe To Karthi

Pawan Kalyan Congratulated Karthi : లడ్డు విషయంలో కార్తీ సారీ చెప్పడంతో పవన్ కళ్యాణ్ ఆయన్ను అభినందించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఫై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భవించే లడ్డు..గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అపవిత్రమైంది. ఈ తప్పును సరిద్దికోవాలని ..ప్రతి ఒక్కరు కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి కి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళ్ హీరో కార్తీ ..తిరుమల లడ్డు విషయంలో సెటైర్లు వేయడం ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే.

కార్తీ (Karthi) నటించిన తాజాగా సత్యం సుందరం (Satyam Sundaram). ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో.. యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. లడ్డు కావాలా నాయాన.. అని ప్రశ్నిస్తుంది. దీనికి ఆయన.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని నవ్వుతూ వెటకారంగా మాట్లాడారు. లడ్డూ గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు. దీంతో ఇది కాస్త వివాదస్పదంగా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ.. కార్తీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.

తిరుమల లడ్డుపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అనడం.. సరికాదన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మరోసారి కార్తీ అలా అనొద్దంటూ కూడా సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవముందని, కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో వెంటనే కార్తీ పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పాడు.

కార్తీ సారీ చెప్పడం తో పవన్ రియాక్ట్ అయ్యారు. కార్తీ వేగంగా స్పందించిన తీరును, మన సంప్రదాయాల పట్ల ఆయన చూపిన గౌరవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. తిరుపతి, శ్రీవారి లడ్డూల వంటి పవిత్ర విషయాలకు సంబంధిన అంశాలపై కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలు ముడిపడి ఉంటాయని , అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని , దీని వెనుక ఎటువంటి ఇతర ఉద్దేశమూ లేకుండా దీన్ని కార్తీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని తెలిపారు. లడ్డూపై వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి అనుకోకుండా వచ్చిందని తాను అర్థం చేసుకున్నానని పవన్ చెప్పుకొచ్చారు. పబ్లిక్ ఫిగర్స్ గా తమ బాధ్యత ఐక్యత, గౌరవాన్ని పెంపొందించడమేనని తెలిపారు. ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి, మన సంస్కృతి, ఆత్మిక విలువల గురించి బాధ్యతను పెంచాలని భావిస్తున్నట్లు , సినిమా ద్వారా ఈ స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

అంకితభావం, ప్రతిభతో కార్తీ సినిమాని మరింత సుసంపన్నం చేస్తోన్న నటుడని, దీంతో ఆయన పట్ల తన అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నానని , సత్యం సుందరం సినిమా విడుదల సందర్భంగా ఆ సినిమా విజయవంతం కావాలని కార్తీకి, సూర్యకు, జ్యోతికకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని తెలిపారు.

Dear @Karthi_Offl garu,

I sincerely appreciate your kind gesture and swift response, as well as the respect you’ve shown towards our shared traditions. Matters concerning our sacred institutions, like Tirupati and its revered laddus, carry deep emotional weight for millions of…

— Pawan Kalyan (@PawanKalyan) September 24, 2024

Read Also : Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు – అంబటి సెటైర్లు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • Hero Karthi
  • Tirumala Laddu Issue

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd