Pawan Kalyan : ఈ ఐదు రోజులు పవన్ అక్కడే బిజీ గా ఉండబోతున్నాడు..
ఓ పక్క అభిమానుల కోసం ..మరోపక్క రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు ఇలా రెండిటిని కొనసాగిస్తూ బిజీ గా ఉన్నాడు
- By Sudheer Published Date - 11:48 AM, Tue - 26 September 23

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఓ పక్క అభిమానుల కోసం ..మరోపక్క రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు ఇలా రెండిటిని కొనసాగిస్తూ బిజీ గా ఉన్నాడు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు OG , ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ రెండు సినిమాలను మరో రెండు నెలల్లో పూర్తి చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ రెండిటి షూటింగ్ లను సమాంతరంగా కొనసాగిస్తున్నాడు. అలాగే రాజకీయాలను కూడా అలాగే కొనసాగిస్తున్నాడు. అక్టోబర్ 01 నుండి వారాహి నాల్గో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో ఈరోజు నుండి ఈ నెల 31 వరకు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లో బిజీ గా ఉండబోతున్నాడు.
పవన్ కళ్యాణ్ పైన మెయిన్ సీన్స్ కి హరీష్ శంకర్ (Harish Shankar) ఈ అయిదు రోజులు షూట్ చేయనున్నాడు. ప్రతి షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక ఫోటోని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాడు హరీష్ . ఇప్పటికే గ్లిమ్ప్స్ తో అంచనాలు పెంచిన హరీష్ , మరోసారి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ని ఇస్తాడని నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ పొలిటికల్ సీజన్ ని టార్గెట్ చేస్తుంది కాబట్టి ఇది వచ్చే ఎన్నికలకి కూడా హెల్ప్ అయ్యేలా ఉండే అవకాశం ఉంది. దేవి శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్.
ఇక వారాహి యాత్ర విషయానికి వస్తే..
.ఇప్పటికే మూడు విడతల్లో వారాహి యాత్ర (Varahi Yatra ) ను పూర్తి చేసిన పవన్.. అక్టోబర్ 1 నుంచి నాల్గో విడత (Varahi Yatra 4th Schedule) యాత్రను కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభించనున్నారు. ఈసారి యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా సాగనుంది. ఈ మేరకు జనసేన రూట్ మ్యాప్ రెడీ చేస్తోంది.
ఈ మూడో విడత యాత్ర మరింత రంజుగా ఉండబోతుందని అర్ధం అవుతుంది. మొదటి మూడు విడతలు వైసీపీ పార్టీ ని టార్గెట్ చేసిన పవన్..ఇప్పుడు నాల్గో విడతలో చంద్రబాబు (Chandrababu ) ను అక్రమంగా అరెస్ట్ చేసిందని , రాబోయే ఎన్నికల్లో టీడిపి – జనసేన కలిసి పోటీ చేయబోతోందని..పోటీ చేయడానికి కారణాలు కూడా పవన్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈసారి ప్రజలు ఎక్కువ సంఖ్యలో యాత్ర లో పాల్గొనడం ఖాయంగా కనిపిస్తుంది. మొన్నటి వరకు జనసేన శ్రేణులు అభిమానులు మాత్రమే యాత్రకు హాజరయ్యారు. కానీ ఇప్పుడు టీడీపీ – జనసేన ఒకటి కావడం తో వారు కూడా పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుఅరెస్ట్ తర్వాత పోలీసులు కఠిన నింబధనలు విధిస్తున్నారు. కనీసం తెలంగాణ నుండి కూడా ఎవర్ని రానివ్వడం లేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో పోలీసులు పవన్ యాత్ర కు ఎలాంటి ఆటంకాలు సృష్టిస్తారో..ఏంటో అనేది చూడాలి.
మరోపక్క చంద్రబాబు ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఏసీబీ కోర్ట్ మరికొన్ని రోజులు పొడిగించడం..పలు కేసుల ఫై ఇంకా విచారణ కొనసాగుతుండడం తో బాబు బయటకు వచ్చేనా అని అంత మాట్లాడుకుంటున్నారు. అందుకే పవన్ తన దూకుడు ను పెంచాలని చూస్తున్నాడు.
Read Also : TCongress: కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ బేజార్, రాజగోపాల్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ లోకి!