OG Pre Release : తాను డిప్యూటీ సీఎం అనేది మరచిపోయిన పవన్ కళ్యాణ్
OG Pre Release : "డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని స్టేజ్ మీద నడుస్తాడని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఇది సినిమా కాబట్టి నేను ఇలా వచ్చాను" అని అభిమానులను ఉత్సాహపరిచాడు
- By Sudheer Published Date - 12:56 PM, Mon - 22 September 25

హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘థే కాల్ హిమ్’ ఓజీ ప్రీ-రిలీజ్ వేడుక(OG Pre Release)లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అద్భుతంగా మారింది. సినిమాలో తన పాత్ర “ఓజస్ గంభీర” లుక్‌లో కటానా కత్తి పట్టుకుని స్టేజ్‌పైకి వచ్చిన పవన్, తన అభిమానులను ఉత్సాహంతో ముంచెత్తాడు. అయితే ఆ కత్తి ఊపుతుండగా, అది కాస్తా తన బాడీగార్డ్‌ను తాకే పరిస్థితి రావడంతో వేదికపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశమైంది.
Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్‌నాథ్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ.. “డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని స్టేజ్ మీద నడుస్తాడని ఎప్పుడైనా అనుకున్నారా? కానీ ఇది సినిమా కాబట్టి నేను ఇలా వచ్చాను” అని అభిమానులను ఉత్సాహపరిచాడు. ఈ మాటలకు అభిమానులు ఘనంగా కరతాళధ్వనులు చేశారు. ఆయన రాజకీయ బాధ్యతలు కొద్దిసేపు మరిచి, సినిమా వాతావరణంలో పూర్తిగా లీనమయ్యారని తన ప్రసంగంలోనే వెల్లడించారు. దర్శకుడు సుజీత్‌నే ఈ కాన్సెప్ట్ వెనుక అసలు హీరోగా ప్రశంసిస్తూ, సినిమా కోసం తనకు చేసిన మార్గదర్శకత్వాన్ని గుర్తు చేసుకున్నారు.
సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బాణీలు, సుజీత్ విజన్, రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో పెద్ద అంచనాలను పెంచిందని పవన్ పేర్కొన్నారు. హీరోయిన్ ప్రియాంకా మోహన్, విలన్‌గా ఎంట్రీ ఇస్తున్న ఎమ్రాన్ హష్మీతో పాటు శ్రీయా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ తదితరులు సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీకి ఇది తొలి దక్షిణాది సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. *థే కాల్ హిమ్ ఓజీ* పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.