Pawan : ‘ఓజీ’ మూడ్ లోకి పవన్
Pawan : పవన్ కళ్యాణ్‌ను ఇలా వరుసగా సినిమా షూటింగుల్లో చూడటం ఆయన అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. రాజకీయాలు ఒకవైపు ఉండగా, సినిమాలపై కూడా పవన్ ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఆనందకరం.
- Author : Sudheer
Date : 22-05-2025 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రస్తుతం రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయనపై ఉన్న సినిమా బాద్యతలపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల()Moviesపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తయింది, ప్రమోషన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు ఆయన ‘ఓజీ’ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ముంబైలో శనివారం నుండి ‘ఓజీ’ షూటింగ్ మొదలవబోతోంది. ఈ షెడ్యూల్‌కు పవన్ 10 నుంచి 12 రోజుల కాల్షీట్లు కేటాయించనున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం కూడా పవన్ తన డేట్లు ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. పవన్ రాక కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న హరీష్ శంకర్‌కు ఇప్పుడు ఊరట లభించింది. మైత్రీ మూవీస్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్‌ను ఇలా వరుసగా సినిమా షూటింగుల్లో చూడటం ఆయన అభిమానులకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. రాజకీయాలు ఒకవైపు ఉండగా, సినిమాలపై కూడా పవన్ ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఆనందకరం.
అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాల తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెబుతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం… ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత కూడా పవన్ మరో ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. అయితే ‘ఉస్తాద్’ షూటింగ్ మాత్రం ఏకధాటిగా జరగడం కష్టమేనని, మద్యమధ్యలో బ్రేక్‌లు అవసరమవుతాయని చిత్ర బృందం చెబుతోంది. అయినా కూడా పవన్ నెలకు కనీసం వారం లేదా పది రోజులు ఈ చిత్రానికి కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. నిర్మాతలు, అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాల కోసం పవన్ తన సమయాన్ని కేటాయించడం సినీ వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.