HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan And Jagan Not Attend Actor Alis Daughters Wedding

Ali Daughter Wedding: అలీ కుమార్తె పెళ్లికి ‘పవన్, జగన్’ డుమ్మా!

టాలీవుడ్  సీనియర్ హాస్యనటుడు అలీ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

  • Author : Balu J Date : 28-11-2022 - 4:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ali
Ali

టాలీవుడ్  సీనియర్ హాస్యనటుడు ఆలీ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అనుకోకుండా ఏపీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ పెళ్లికి రాలేకపోయారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరిన తర్వాత పవన్, అలీల మధ్య గ్యాప్ వచ్చిందని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. పవన్ నిజంగానే ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని, అయితే విమానం ఆలస్యం కావడంతో, అందుకే రాలేకపోయారని అంటున్నారు. పవన్, అలీ మధ్య పెద్ద సమస్యలు లేవు అని పలువురు అంటున్నారు.

ఇటీవల అలీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని జగన్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం జగన్ కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలో గుంటూరులో రిసెప్షన్ వేడుక ఉండబోతోందట. ఈ రిసెప్షన్ కి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరు కానున్నట్లు టాక్. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారా? లేరా అనేది వేచి చూడాల్సిందే.

నూతన జంటను ఆశీర్వదించినవారికి కృతజ్ఞతలు – డాక్టర్‌ ఆలీ

‘‘మా అమ్మాయి ఫాతిమా విహహం ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో గ్రాండ్‌గా జరిగింది. వధూవరులను ఆశీర్వదించటానికి సినిమా రంగంతో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు పాల్గొని వధువు ఫాతిమా వరుడు షహయాజ్‌లను నిండుమనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి–సురేఖ, యస్‌స్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, బ్రహ్మానందం, జయసుధ, నాగార్జున–అమలా, వెంకటేశ్, అనిల్‌ రావిపూడి, బోయపాటి శ్రీను, రాజశేఖర్‌–జీవిత, నిర్మాతలు అల్లు అరవింద్, కె.యల్‌ నారాయణ, ఎస్‌ గోపాల్‌రెడ్డి, చోటా.కె.నాయుడు, తనికెళ్ల భరణి, మంచు విష్ణు, లక్ష్మీ, తొట్టెంపూడి వేణు, ఆది సాయికుమార్, గౌతమ్‌ బ్రహ్మానందం, ఊహ, రోషన్, ‘అల్లరి’ నరేశ్, రాజేశ్, ప్రియదర్శి, పూరి జగన్నా«ద్‌ సతీమణి లావణ్య, ఆకాశ్‌ పూరి, పవిత్రా పూరిలతో పాటు నాతో అనేక సినిమాల్లో నటించిన తోటి నటీనటులు 200మంది వరకు హాజరై వధూవరులను దీవించారు. ప్రపంచ చాంపియన్‌ పి.వి సింధు తల్లితండ్రులతో సహా పెళ్లికి హాజరయ్యారు. ముస్లిం సాంప్రదాయంలో కన్నులపండుగలా జరిగిన ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్, మార్గాని భరత్, ప్రత్తిపాటి పుల్లారావు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు. నా అతిధ్యాన్ని స్వీకరించి నూతన జంటను ఆశీర్వదించిన అతిరథ మహారధులందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’’ అని ఆలీ సంతోషం వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ali
  • AP CM Jagan
  • daughter marriage
  • Pawan Kalyan

Related News

    Latest News

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. ప్రతిభావంతురాలైన విద్యార్థినికి అండ‌

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd