Pallavi Prashanth : బిగ్‌బాస్ గొడవలో ఇద్దరు అరెస్ట్.. A1 గా పల్లవి ప్రశాంత్, మరికొంతమందిపై కేసులు..
పోలీసులు హెచ్చరించినా పల్లవి ప్రశాంత్ వెళ్లిపోకుండా అక్కడే ర్యాలీ చేసి రచ్చ చేసినందుకు, కార్ పోనివ్వకుండా అక్కడే రెండు సార్లు రౌండ్లు వేసినందుకు గాను..
- Author : News Desk
Date : 19-12-2023 - 7:59 IST
Published By : Hashtagu Telugu Desk
బిగ్‌బాస్ సీజన్ 7(Bigg Boss 7)లో పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడూ జరగనంత రచ్చ ఈ సారి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అతని మనుషులు చేశారు. ఆదివారం రాత్రి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ అభిమానులు వేరే కంటెస్టెంట్స్, వారి కార్లపై దాడి చేసి, కార్ అద్దాలు పగలకొట్టారు. ఈ ఘటనలో గవర్నమెంట్ బస్ అద్దాలు కూడా పగలకొట్టారు.
ఈ గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం చేసినందుకు గాను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ పై కూడా పోలీసులు(Police) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఆరు బస్సులు, ఓ పోలీస్ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సీసీ ఫుటేజీ, వీడియోలో వచ్చిన ఆధారాలతో నిందితులను గుర్తించి దాడులకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తాం అని నిన్న తెలిపారు పోలీసులు.
తాజాగా నేడు ఈ ఘటనలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కి తరలించారు. అలాగే పోలీసులు హెచ్చరించినా పల్లవి ప్రశాంత్ వెళ్లిపోకుండా అక్కడే ర్యాలీ చేసి రచ్చ చేసినందుకు, కార్ పోనివ్వకుండా అక్కడే రెండు సార్లు రౌండ్లు వేసినందుకు గాను ఈకేసులో పల్లవి ప్రశాంత్ ని A-1 గా, అతని తమ్ముడు మనోహర్ A-2 గా, మరో స్నేహితుడు A-3 గా కేసు నమోదు చేశారు పోలీసులు. త్వరలోనే పల్లవి ప్రశాంత్ ని కూడా విచారిస్తామని, మీడియా వీడియోలు, సీసీ టీవీ పుటేజీ ఆధారంగా మరికొంత మంది ఆకతాయిలను పట్టుకుంటామని తెలిపారు.
Also Read : Salaar : ప్రభాస్ అభిమానులకు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్..