Balakrishna : పౌరసన్మాన సభలో బాలకృష్ణ హుషారు
Balakrishna : వేలాది మంది అభిమానులు, కుటుంబసభ్యుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది
- Author : Sudheer
Date : 05-05-2025 - 8:12 IST
Published By : Hashtagu Telugu Desk
సినీ నటుడు, రాజకీయ నేత, సేవా కార్యక్రమాల్లో ముందుండే నందమూరి బాలకృష్ణ (Balakrishna) తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం (Padma Bhushan Award) అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించేందుకు నిర్వహించిన పౌరసన్మాన సభ ఎంతో ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానులు, కుటుంబసభ్యుల మధ్య ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. నాన్న ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని..తనకు పద్మభూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
సినిమా, రాజకీయ ప్రస్థానాలు రెండిటి గురించి మాట్లాడుతూ.. తన రెండో ఇన్నింగ్స్ మరింత బలంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇటీవల వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చిన బాలయ్య, ఇకపై మరింత దూకుడుగా ముందుకెళ్తానంటూ ‘సింహా’ సినిమాలోని డైలాగ్‌ను చెబుతూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. తన అభిమానులు ఇప్పటితో ముగియరని, రాబోయే తరాల్లో కూడా పుడుతూనే ఉంటారని ఆయన ధీమాగా తెలిపారు. మైకును గాల్లోకి ఎగురవేసి పట్టుకోవడం గురించి సరదాగా చెప్పి నవ్వులు పూయించారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 తో బిజీ గా ఉన్నారు.
I’ll show you all my second innings now, started after four consecutive hits, says Padmabhushan Nandamuri Balakrishna. pic.twitter.com/zw6AO0LYpZ
— Telugu Chitraalu (@TeluguChitraalu) May 4, 2025