Oscar Challagariga : కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ గా ‘ఆస్కార్ చల్లగరిగ’
- By Sudheer Published Date - 12:26 PM, Thu - 28 December 23

ప్రముఖ తెలుగు సినీ రచయిత చంద్రబోస్‌పై తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘ఆస్కార్ చల్లగరిగ’ (Oscar Challagariga) కేన్స్ చిత్రోత్సవంలో సత్తాచాటింది. ఫ్రాన్స్ (France) వేదికగా జరుగుతున్న కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes World Film Festival)లో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. డాక్యుమెంటరీ విభాగంలో విన్నర్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ (Best Documentary Short) గా నిలిచిందని ప్రముఖ పాత్రికేయుడు చిల్కూరి సుశీల్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
చిల్కూరి సుశీల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీని నిర్మించడం జరిగింది. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ పాట రాసినందుకు గాను రచయిత చంద్రబోస్‌తో పాటు సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్ కీరవాణీలకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత తన స్వంతగ్రామమైన భూపాలపల్లిలోని చల్లగరిగకు వచ్చినప్పుడు చంద్రబోస్‌ను ఆ గ్రామ ప్రజలు రిసీవ్ చేసుకున్న తీరు, ఆ గ్రామంతో ఆయనకుండే అనుభవాలను ఇతివృత్తంగా తీసుకుని సుశీల్ కుమార్ ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అమెరికా, జర్మనీ, కెనడా, బల్గేరియా, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, స్వీడన్, స్పెయిన్ వంటి దేశాల నుంచి వచ్చిన చిత్రాల పోటీని తట్టుకుని షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. తాజాగా విన్నర్‌గా నిలవడం గమనార్హం. ఈ విజయం పట్ల చంద్రబోస్ హర్షం వ్యక్తం చేసారు.
“కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా “ఆస్కార్ చల్లగరిగ” గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని, భారతదేశంలోని ఓ కుగ్రామంలో జరిగిన వేడుక ప్రపంచ దృష్టిని ఆకర్షించడం అద్భుతమైన విషయం అని , ఈ అవార్డు కేవలం చంద్రబోస్‌కే కాకుండా ఆయన గ్రామమైన చల్లగరిగకు దక్కిన నివాళి అని చిల్కూరి సుశీల్‌రావు చెప్పుకొచ్చారు.
Read Also : AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ..?