Varun Tej: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి దిగిన చెర్రీ, సల్మాన్ ఖాన్..?
- By Sailaja Reddy Published Date - 09:00 AM, Tue - 20 February 24
మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు వరుణ్ తేజ్. అందులో భాగంగానే మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ థ్రిలర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. పోస్టర్లు టీజర్లు చూసిన అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం. వరుణ్ తేజ్ ఖాతాలో ఒక సక్సెస్ సినిమా పడినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగానే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఆపరేషన్ వాలెంటైన్ నుంచి ఫైనల్ స్ట్రైక్ నేడు అనగా ఫిబ్రవరి 20న రానున్నట్లు వెల్లడించింది. మంగళవారం ఉదయం 11.05 నిమిషాలకు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్ర బృందం.
తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేయనుండగా, హిందీ ట్రైలర్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. అలా తెలుగులో రామ్ చరణ్ వరుణ్ తేజ్ కి సపోర్ట్ చేస్తుండగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ విషయం పట్ల వరుణ్ తేజ్ స్పందిస్తూ.. ఇంతకంటే ఇంకేం కావాలి.. భాయ్‌తో పాటు భాయిజాన్ ఇద్దరూ కలిసి ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు అని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
Related News
Dhanush : మాస్క్ లేకుండా చెత్తలో 10 గంటలు.. కుబేర కోసం ధనుష్ డెడికేషన్ లెవెల్ ఇది..!
Dhanush శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా కుబేర. ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక