1000cr Heros: కో అంటే కోటి.. ఒక్క సినిమాకే 1000 కోట్లు కొల్లగొడుతున్న హీరోలు వీళ్లే!
మన సినిమాలు రూ. 1000 కోట్ల మార్కును కూడా అధిగమిస్తూ సత్తా చాటుతున్నాయి.
- By Balu J Published Date - 01:38 PM, Sat - 3 June 23
ఒకప్పుడు మన ఇండియన్ సినిమాలు (Indian Moive) 100 కోట్ల కలెక్షన్లు రాబట్టడం అనేది చాలా కష్టంతో కూడిన టాస్క్. భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా వంద కోట్లు గ్రాస్ అందిపుచ్చుకోలేకపోయాయి. అయితే బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా క్రేజ్ ఎప్పుడైతే మొదలైందో.. వంద కోట్ల రికార్డులు ఈజీగా సాధ్యమైంది. అయితే గత ఐదేళ్లలో భారీ బడ్జెట్ సినిమాలు రూపుదిద్దుకోవడం, చాలా సినిమాలు ఇతర భాషల్లోనూ సత్తా చాటుతుండటంతో 1000 కోట్లు కూడా రాబట్టిన దాఖలాలున్నాయి. కానీ ఇప్పుడు మన సినిమాలు రూ. 1000 కోట్ల మార్కును కూడా అధిగమిస్తూ సత్తా చాటుతున్నాయి.
ఈ సినిమాలన్నీ విభిన్న జానర్లకు చెందినవి అయినప్పటికీ కథ, కథనం, హీరో స్టామినా బట్టి ఊహించనివిధంగా కోట్ల కరెన్షీ వర్షం కురుస్తోంది. పాన్-ఇండియన్ చలనచిత్ర యుగం ప్రారంభం కావడంతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల భారీ కలెక్షన్లు నమోదవుతాయి. అయితే ఓ ఐదుగురు సూపర్ స్టార్స్ మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ, 1000 కోట్లు ఈజీగా కొల్లగొడుతూ పాన్ ఇండియన్ సినిమాను శాసిస్తున్నారు.
1. ప్రభాస్— బాహుబలి (Bahubali)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ వచ్చిన బాహుబలి పార్ట్-1, పార్ట్-2 సినిమాలు అత్యధిక కలెక్షన్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందాయి. 2017లో విడుదలైన బాహుబలి2 గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు వసూలు చేసింది. ఇక 1000 కోట్లు కొల్లగొట్టిన సూపర్ స్టార్‌గా ప్రభాస్ నిలిచాడు.
2. అమీర్ ఖాన్ — దంగల్ (Dangal)
బాహుబలి వచ్చిన ఏడాదిలోనే మరో సినిమా రూ.1968 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం దంగల్‌లో బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ మిస్టర్ అమీర్ ఖాన్ హీరోగా నటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించిన ఫోగట్ సోదరీమణుల కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ మంచి కలెక్షన్లు సాధించింది.
3. RRR — Jr NTR, రామ్ చరణ్
‘RRR’ US అవార్డుల సర్క్యూట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ చిత్రం. టాలీవుడ్ యంగ్ టైగర్ Jr NTR, మెగా హీరో రామ్ చరణ్ కలిసి 1000 cr క్లబ్లో చేరారు. ఇది SS రాజమౌళి రెండవ చిత్రంగా జాబితాలో చేరింది. చారిత్రక వాస్తవాలను తప్పుగా చూపించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు నాటు నాటు పాట నచ్చడంతో ఆస్కార్‌ను సైతం అందుకుంది. 2022లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
4. యష్ — KGF: చాప్టర్ 2
RRR మూవీ 1000 కోట్ల క్లబ్లో చేరిన ఒక నెల లోపే, కన్నడ సూపర్ స్టార్ యష్ KGF: చాప్టర్ 2 1000 కోట్లు సాధించి సౌత్ ఇండియన్ సినిమా సత్తా చాటింది. పార్ట్-1 మంచి కలెక్షన్స్ రాబట్టిప్పటికీ, పార్ట్-2(కేజీఎఫ్2) పై భారీగా అంచనాలు ఏర్పడటంతో రూ. 1200 కోట్లు వసూలు చేయగలిగింది.
5. షారుఖ్ ఖాన్ – పఠాన్ (Pathaan)
చాలా కాలం తర్వాత కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్ షా పఠాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు సాధించింది షారుఖ్ కు మరిచిపోలేని హిట్ ను అందించింది. పఠాన్ ధాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
Also Read: Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం పట్ల చిరు, తారక్ దిగ్భ్రాంతి!
Related News
Sharukh khan : దేవర డైరెక్టర్ పై షారుఖ్ ఖాన్ కన్ను.. భారీ ప్లాన్..!
Sharukh khan కొన్నాళ్లుగా ఏమాత్రం ఫాం లో లేని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ వరుసగా 3 సినిమాలతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. పఠాన్, జవాన్, డుంకీ సినిమాలతో