Ileana : ఒక్క ఛాన్స్ ప్లీస్ అంటున్న పోకిరి భామ..!
Ileana గోవా బ్యూటీ ఇలియానా తెలుగు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. మొదటి సినిమా దేవదాస్ ఆ తర్వాత పోకిరి రెండు సినిమాలతో అప్పటి యూత్ ఆడియన్స్ ని తన మాయలో
- By Ramesh Published Date - 09:55 AM, Sat - 1 June 24

Ileana గోవా బ్యూటీ ఇలియానా తెలుగు సినిమాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. మొదటి సినిమా దేవదాస్ ఆ తర్వాత పోకిరి రెండు సినిమాలతో అప్పటి యూత్ ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంది. ఐతే టాలీవుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకు వెళ్లింద్ ఇలియానా. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన క్రేజ్ చాలదు అన్నట్టు బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడ సినిమాలపై ఆసక్తి చూపించింది. చిన్నగా మన మేకర్స్ ఆమెను కాదని వేరే హీరోయిన్స్ కు అవకాశాలు ఇచ్చారు.
అలా తన సౌత్ సినిమాలకు తానే ఎండ్ కార్డ్ వేసుకుంది ఇలియాన. బాలీవుడ్ వెళ్లినా ఇక్కడ సినిమాలు కూడా చేసుంటే ఇలియానా పరిస్థితి వేరేలా ఉండేది. ఇక బోయ్ ఫ్రెండ్ తో సహజీవనం ఆ తర్వాత బాబు పుట్టడం ఇదంతా ఇలియానా లైఫ్ లో జరిగిన అద్భుతాలని చెప్పొచ్చు. అంతకుముందు బీచ్ సైడ్ హాట్ ఫోటోస్ తో తన ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేసిన ఇలియానా ఒక బిడ్డకు తల్లయ్యాక మాత్రం వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసింది.
ఐతే ఇప్పటికీ తనకు ఛాన్స్ ఇస్తే టాలెంట్ చూపిస్తా అంటుంది ఇలియానా. సౌత్ సినిమాలే తనను ఈ స్థాయికి తెచ్చాయి కాబట్టి వాటి మీదే అమ్మడు ఫోకస్ చేస్తుంది. తెలుగులో దాదాపు స్టార్స్ అందరితో నటించిన ఇలియానా హీరోయిన్ గా కాకపోయినా కనీసం ఐటెం సాంగ్ కోసం ఐనా సరే తను చేసేందుకు ఓకే అనేస్తుంది. మరి ఇలియానా ఈ రిక్వెస్ట్ ని తెలుగు మేకర్స్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.
Also Read : Gangs Of Godhavari : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ హీరో చేయాల్సిందా..?