Hungry Cheetah : OG కాస్త హంగ్రీ చీతా గా మారబోతుందా..?
- By Sudheer Published Date - 03:39 PM, Sat - 3 February 24

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న OG టైటిల్ మారబోతుందా..? OG కాస్త హంగ్రీ చీతా (Hungry Cheetah) అవుతుందా..? ఇప్పుడు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. సాహో ఫేమ్ సుజిత్ – పవన్ కళ్యాణ్ కలయికలో OG మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా లేకపోతే ఈ టైం కల్లా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది..కానీ పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో ఈ సినిమా ఆలస్యం అవుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో ఎన్నికలు పూర్తియిన తర్వాత ఈ సినిమా పూర్తి చేస్తారని అంటున్నారు..మరికొంతమంది మాత్రం ఈ లోపే పూర్తి చేస్తారని చెపుతున్నారు. ఇదిలా ఉండగా..ఇప్పుడు ఈ మూవీ టైటిల్ విషయంలో ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ మూవీ నిర్మాత దానయ్య (Producer Danayya).. ఫిలిం ఛాంబర్ లో ‘హంగ్రీ చీతా’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసారు. ఈ టైటిల్ ఎవరి కోసం అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమా కోసమే అని అంటున్నారు. ముందుగా ఈ చిత్రానికి ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసారు. గ్లిమ్ప్స్ లో కూడా ఇదే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ గ్లిమ్ప్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో హంగ్రీ చీతా అనే వర్డ్ విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ పాత సినిమాల వీడియోలకి కూడా హంగ్రీ చీతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టుకోని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసారు. ఇలాంటి సమయంలో దానయ్య ఇదే టైటిల్ ని రిజిస్టర్ చేయించడం హాట్ టాపిక్ అయ్యింది. ‘దే కాల్ హిమ్ ఓజీ’ టైటిల్ ని మార్చి హంగ్రీ చీతా అని ఫిక్స్ చేస్తున్నారా లేక వేరే హీరో కోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించారా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ కు అయితేనే సెట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ టైటిల్ ఎవరి కోసం అనేది నిర్మాతే చెప్పాలి.
Read Also : Perni Nani : జగన్ కోసం డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి