OG Item Update : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘OG’లో స్పెషల్ సాంగ్
OG Item Update : ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ సాంగ్ నిన్న ఈవెనింగ్ షోల నుంచే అందుబాటులోకి వచ్చింది. స్టైలిష్ బీట్స్, నేహా గ్లామర్‌తో ఈ పాట ఫ్యాన్స్‌లో ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
- By Sudheer Published Date - 11:04 AM, Wed - 1 October 25

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన OG సినిమా విడుదలైన మొదటి రోజునుంచే పెద్ద హైప్‌ని సృష్టించింది. మొదట మిక్స్డ్ రివ్యూలు వచ్చినా, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్, సుజీత్ స్టైల్ మేకింగ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతోంది. ప్రత్యేకించి పవన్ ఫ్యాన్స్, యూత్ మధ్య సినిమా హంగామా కొనసాగుతూనే ఉంది. ఈ కలెక్షన్ ఫ్లోతో మేకర్స్‌కి మంచి బూస్ట్ లభించింది.
మూవీకి మరింత కిక్ ఇచ్చేలా మేకర్స్ తాజాగా సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. నేహా శెట్టి నటించిన ప్రత్యేక గీతాన్ని సినిమాలో యాడ్ చేశామని ప్రకటించారు. ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ సాంగ్ నిన్న ఈవెనింగ్ షోల నుంచే అందుబాటులోకి వచ్చింది. స్టైలిష్ బీట్స్, నేహా గ్లామర్‌తో ఈ పాట ఫ్యాన్స్‌లో ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో ఈ కొత్త సాంగ్‌కు విశేష స్పందన వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు
OG సినిమాపై హైప్ కొనసాగుతోన్న తరుణంలో ఈరోజుమూవీ టీమ్ ప్రత్యేకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ హాజరు కావచ్చన్న టాక్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం నింపుతోంది. కొత్త పాటతో పాటు ఈ సెలబ్రేషన్స్ సినిమా రన్‌ను ఇంకా పెంచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, మిక్స్డ్ టాక్ వచ్చినా, పవన్ కళ్యాణ్ ఇమేజ్, కొత్త సాంగ్, సెలబ్రేషన్స్‌తో OG కలెక్షన్ల పరంగా విజయవంతమైన ట్రాక్‌పై దూసుకెళ్తోంది.