Pawan Kalyan : OG వెనక్కి వీరమల్లు ముందుకు..?
Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఏపీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన శాఖలకు మంత్రిగా
- By Ramesh Published Date - 08:15 AM, Mon - 1 July 24

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఏపీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన శాఖలకు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు బిజీగానే ఉంటున్నారు. ఐతే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వచ్చి సినిమాలు చేస్తాడేమో అనుకున్న నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. సెట్స్ మీద ఉన్న సినిమాలను పూర్తి చేసేందుకు పవన్ డేట్స్ కోసం వాళ్లు నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ సినిమా.. ఏ.ఎం రత్నం నిర్మాణంలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఈ రెండు ముందు పూర్తి చేయాల్సి ఉంది. ఐతే పవన్ ఓజీ సినిమా ముందు రిలీజ్ చేస్తాడని అనుకోగా ఇప్పుడు ప్లాన్ మార్చి వీరమల్లుని పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఓజీ సినిమాఉ సెప్టెంబర్ 27న రిలీజ్ అనౌన్స్ చేయగా ఆ సినిమాకు కొంత పార్ట్ షూట్ చేయాల్సి ఉని.
కానీ ఇప్పుడు వీరమల్లుని ముందు పూర్తి చేసి రిలీ చేయాలని పవన్ అనుకుంటున్నారట. ఓజీని వాయిదా వేసి హరి హర వీరమల్లు సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకు తగినట్టుగా తన షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారట పవన్ కళ్యాణ్. మొత్తానికి ఏదో ఒక సినిమా పవన్ నుంచి రావాలంటూ కోరుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి డిసెంబర్ లో వీరమల్లు సినిమా సర్ ప్రైజ్ చేయనుంది. క్రిష్ డైరెక్షన్ లో మొదలు పెట్టిన వీరమల్లు సినిమా నాలుగేళ్లు అవుతున్నా పూర్తి కాకపోయేసరికి ఆ డైరెక్టర్ ఎగ్జిట్ అయ్యాడు. ప్రస్తుతం జ్యోతికృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
Also Read : Kalki 2898AD : కల్కి 500 కోట్లు కౌంటింగ్.. ఇది ప్రభాస్ మాస్ విజృంభన..!