HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Story Of Legendary Politician And Actor Nandamuri Taraka Rama Rao

Nandamuri Taraka Rama Rao : మ‌ర‌ణంలేని జ‌న‌నం!

యుగ‌పురుషుడు నంద‌మూరి తార‌క‌రామారావు. ప్ర‌తి తెలుగువాడి గుండెల్లో ప‌దిలంగా మెదులుతుంటారు

  • By CS Rao Published Date - 05:53 PM, Fri - 27 May 22
  • daily-hunt

యుగ‌పురుషుడు నంద‌మూరి తార‌క‌రామారావు. ప్ర‌తి తెలుగువాడి గుండెల్లో ప‌దిలంగా మెదులుతుంటారు. సాధార‌ణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయ‌న విశ్వ‌విఖ్యాతిగాంచారు. కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. మిడిల్ క్లాస్ అబ్బాయిలు ప‌డే బాధ‌ల‌న్నింటికీ చూశారు. ఇంటింటికి తిరిగి పాలుపోస్తూ క‌ష్టం విలువ తెలుసుకుని ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదిగిన మేరున‌గ‌ధీరుడు. ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను తిరుగులేని నాయ‌కునిగా ఎన్టీఆర్ ఎదిగారు.

‘నందమూరి తారక రామారావు’ మాటే ఓ సంచలనం.. రాజకీయాల్లో ప్రభంజనం.. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్ర‌తీక‌. ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. సంక్షేమ పథకాలకు తారకమంత్రం అన్న ఎన్టీఆర్. `ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చింది. కార్మికుడి కరిగిన కండాలల్లోనుండి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుండి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి’ అంటూ.. 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. తారకరాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయి. రాజ్యసభ సీటు ఇస్తాం అంటూ రాయభారాలు మొదలయ్యాయి. ‘లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే’ వివేకానందుడి మాటల్ని ఒంటిపట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనకడుగు వేయలేదు. ఓట్లేయండని.. జనంలోకి వచ్చేసరికి జనం నీరాజనాలు పలికారు.

చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి, దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను చాటారు. ఎన్టీఆర్ పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరజిల్లింది. ప్రతి మాట ఓ తూటాగా ఎన్టీఆర్ సందేశమే స్పూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడిన హీరో రాజకీయ నేతగానూ అభిమానించబడ్డారు. కృష్ణుడు అంటే ఎలా ఉంటారో, రాముడు అంటే ఎలా ఉంటారో తెలియని వారికి ఇదిగో వారి రూపం అంటూ నటుడిగా సాక్ష్యాత్కరించిన నటసార్వభౌముడు ఎన్టీఆర్. నాయకుడంటే ఇలా ఉంటాడు అని పాలించి చూపించారు. అందుకే రాజకీయం అనే డిక్షనరీలో తొలిపేజీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అన్న ఎన్టీఆర్‌దే మొదటి స్థానం.

అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడు దరిచేరనివ్వలేదు. ‘ప్ర‌జ‌లే దేవుళ్లు, సమాజమే నా దేవాలయం’ అంటూ కాషాయి వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనారు ఎన్టీఆర్. నాడు ఎన్టీఆర్ స్థాపించిన ‘తెలుగు దేశం పార్టీ’ అప్పటి నుండి ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికీ అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ఠ పునాదులే. ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.

విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు

1942 మే నెలలో (20 ఏళ్ళ వయసులో) మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. మొత్తం 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు భార్య పురంధ‌రేశ్వ‌రి రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా తొలి నుంచి ఉన్నారు. ఒకానొక స‌మ‌యంలో హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ రాజ‌కీయాల్లో చురుగ్గా ఉంటార‌ని ఎన్టీఆర్ భావించారు. రాజ‌కీయ వార‌సులుగా ఎన్టీఆర్ బ‌తికున్న రోజుల్లో ఊహించారు. కానీ, బ‌లీయ‌మైన విధి ఆయ‌న్ను వంచించింది. చివ‌రకు 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయ‌న లేయిన‌ప్ప‌టికీ మ‌ర‌ణంలేని జ‌న‌నం మాదిరిగా ఎన్టీఆర్ తెలుగు వాళ్ల గుండెల్లో నిలిచిపోయారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sr ntr
  • telugu desam founder
  • telugu desam party

Related News

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా

Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.

  • A milestone in a long political career.. 30 years since becoming CM for the first time!

    Chandrababu Naidu : సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మైలురాయి..తొలిసారి సీఎం అయి నేటికి 30 ఏళ్లు!

Latest News

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd